Friday, April 26, 2024
Friday, April 26, 2024

తగ్గనున్న బంగారం, పామాయిల్‌ ధరలు

బేసిక్‌ డ్యూటీని తగ్గించిన కేంద్ర సర్కారు
కేంద్ర సర్కారు ముడి పామాయిల్‌, శుద్ధి చేసిన పామాయిల్‌, ముడి సోయా ఆయిల్‌, బంగారం, వెండి దిగుమతిపై సుంకాలను తగ్గిస్తూ నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వీటి ధరలు తగ్గాయి. దీంతో దేశీ వినియోగదారులకు ఊరట నిచ్చేందుకు వీలుగా కనీస దిగుమతి సుంకాలను తగ్గించింది. కేంద్ర సర్కారు ప్రతి పక్షం రోజులకు ఒక పర్యాయం వంట నూనెలు, బంగారం, వెండి దిగుమతులపై బేసిక్‌ డ్యూటీని సవరిస్తుంటుంది. భారత్‌ వంట నూనెలు, వెండి విషయంలో ప్రపంచంలోనే అతిపెద్ద దిగుమతిదారుగా, బంగారంలో రెండో అతిపెద్ధ (చైనా తర్వాత) దిగుమతిదారుగా ఉంది. ముడి పామాయిల్‌ పై టన్నుకు సుంకం 996 డాలర్ల నుంచి 937 డాలర్లకు తగ్గింది. ఆర్బీడీ పామాయిల్‌ దిగుమతిపై సుంకం టన్నుకు 1,019 డాలర్ల నుంచి 982 డాలర్లకు దిగొచ్చింది. ఇక ఆర్బీడీ పామోలీన్‌ పై టన్నుకు 1,035 డాలర్ల నుంచి 998 డాలర్లకు తగ్గింది. ముడి సోయా ఆయిల్‌ పై 1,362 డాలర్ల నుంచి 1,257 డాలర్లకు దిగొచ్చింది. బంగారం టన్ను దిగుమతిపై సుంకం 549 డాలర్ల నుంచి 533 డాలర్లకు, వెండిపై 635 డాలర్ల నుంచి 608 డాలర్లకు తగ్గింది. ఆర్‌ బీ డీ అంటే రిఫైన్డ్‌ (శుద్ధి చేసిన), బ్లీచ్డ్‌, డియోడరైజ్డ్‌ అని అర్థం. తగ్గిన సుంకాల మేర బహిరంగ మార్కెట్‌ ధరలు కూడా సవరణకు లోను కానున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img