Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

త్వరలో పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు

న్యూదిల్లీ : అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరినాటికి పూర్తి స్థాయిలో ఈ సేవలను పునరుద్ధరిస్తామని తెలిపింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకలు ఈ ఏడాది చివరినాటికి సాధారణ స్థితికి రావచ్చునని విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజీవ్‌ బన్సాల్‌ బుధవారం వెల్లడిరచారు. దేశంలో కోవిడ్‌ ప్రేరేపిత లాక్‌డౌన్‌ కారణంగా అన్ని అంతర్జాతీయ విమానాలు (మందులు, ఆహారం, వైద్య పరికరాలు వంటి అత్యవసర వస్తువులను తీసుకువెళ్లేవి మినహా) గత ఏడాది మార్చిలో నిలిపివేయబడ్డాయి. కేసుల సంఖ్య తగ్గడం, ,వాక్సినేషన్‌ ముమ్మరమైన తర్వాత ఇతర దేశాలతో చర్చలు జరిపిన మీదట ‘ఎయిర్‌ బబుల్‌’ ఏర్పాట్లతో విమాన రాకపోకలపై పరిమితులు సడలించడం జరిగింది. భారత్‌ ప్రస్తుతం 25 దేశాలతో ఈ తరహా ఒప్పందాలను కలిగి ఉంది. ఎయిర్‌ బబుల్‌ నిబంధనలకు లోబడి రెండు దేశాల విమాన సంస్థలు ప్రయాణీకుల విమానాలు నడపవచ్చు. గత వారం పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ అంతర్జాతీయ విమాన సేవలను సాధారణీకరించే ప్రక్రియను ప్రభుత్వం మదింపు చేస్తోందని చెప్పారు. పరిస్థితులు సాధారణ స్థితికి రావడంపై ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నప్పటికీ, కొత్తగా కరోనా కేసులు ప్రబలకుండా రక్షణ కల్పించడానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రత్యేకించి అనేక యూరోపియన్‌ దేశాల్లో రోజువారీ కొత్త కేసుల పెరుగుదలను ఆయన ప్రస్తావించారు. లాక్డౌన్‌ సమయంలో పరిమితం చేయబడిన దేశీ విమాన సర్వీసులు గత నెల నుంచి పూర్తి సామర్థ్యంతో కఅనుమతించబడ్డాయి. రెండు నెలల విరామం తర్వాత గత ఏడాది మేలో ప్రభుత్వం దేశీయ విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. అంతర్జాతీయ ప్రయాణీకుల విమాన సర్వీసులను పూర్తిస్థాయిలో పునఃప్రారంభించేందుకు సన్నాహకంగా, పర్యాటక వీసాల మంజూరును నవంబర్‌ 15న ప్రభుత్వం పునఃప్రారంభించబడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img