Friday, April 26, 2024
Friday, April 26, 2024

నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదు

అఖిలేశ్‌ యాదవ్‌ సూటిప్రశ్న
లక్నో :
లఖింపూర్‌ఖేరీ హింసపై అన్ని అధారాలు ఉన్నప్పటికీ కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కొడుకుని ఎందుకు అరెస్టు చేయలేదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ ప్రశ్నించారు. రైతులను చంపిన కేసులో కేంత్రమంత్రి కుమారుడి పాత్రకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అజయ్‌మిశ్రా వైపు అన్నివేళ్లూ చూపుతున్నా లఖింపూర్‌ కేసులో ఆయననుగానీ, ఆయన కుమారుడిని కానీ ఎందుకు జైలుకు పంపలేదని నిలదీశారు. అఖిలేశ్‌ తన నివాసం వద్ద విలేకరులతో మాట్లాడుతూ మోదీ, యోగి ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్లున్న నేరస్తులు జైలుకు వెళ్లాల్సిందే. ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాల్సిందే. ఈ మొత్తం ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. ప్రత్యక్ష సాక్షులు మాట్లాడిన వీడియో క్లిప్పులు ఉన్నాయి. భయపెడుతూ మంత్రి ప్రకటనలు చేస్తున్నారు. నిందితుడు ఆశిష్‌ మిశ్రా స్వయానా కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా తనయుడు. అందుకే ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని అఖిలేశ్‌ విమర్శించారు. నిందితుడి తండ్రి కేంద్రమంత్రిగా ఉన్నంత వరకూ రైతులకు న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img