Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నిలిచిన స్టీల్‌ ఉత్పత్తి

భారీగా సమ్మెలో పాల్గొన్న ఉక్కు కార్మికులు
న్యూదిల్లీ: నరేంద్రమోదీ ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలపై కేంద్ర కార్మిక సంఘాలు సోమవారం చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో ప్రభుత్వరంగ సెయిల్‌, ఆర్‌ఐఎన్‌ఎల్‌, ఎన్‌ఎండీసీకి చెందిన లక్షలాది కార్మికులు పాల్గొన్నారు. దీని ప్రభావం స్టీల్‌ ప్లాంట్లు, గనుల ఉత్పత్తిపై తీవ్రంగా పడిరది. రెండు రోజుల సార్వత్రిక సమ్మెలో భాగంగా రాష్ట్రీయ ఇస్పాట్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌)కు చెందిన మొత్తం 11 వేలమందికిగాను 8 వేలమంది నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కార్మికులు విధులకు హాజరు కాలేదని కంపెనీ అధికారి ఒకరు చెప్పారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో మొత్తం మూడు ఫర్నేసులకుగాను ఒక ఫర్నేసుపై సమ్మె ప్రభావం పడిరదని ఆయన వివరించారు. అయితే, మూడిరటిలో ఒకటి పనిచేయడం లేదని, మరొకటి ముందు జాగ్రత్తల్లో భాగంగా ఉత్పత్తిని నిలిపివేశామని ఆయన తెలిపారు. కంపెనీకి చెందిన 10 వేలమంది నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారని ఎన్‌ఎండీసీ ఆపరేషన్‌ గనులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎన్‌ఎండీసీ సంయుక్త ఖదాన్‌ మజ్దూర్‌ సంఫ్‌ు కార్యదర్శి రాజేశ్‌ సంధు చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తెలంగాణలలోని ఎన్‌ఎండీసీ గనులు, కార్యాలయాల కార్మికులు సమ్మెలో భాగస్వాములయ్యారని సంధు వెల్లడిరచారు. ఛత్తీస్‌గఢ్‌లోని బచ్చెలి, కర్ణాటకలోని దొనిమలై వంటి కీలక మైనింగ్‌ కాంప్లెక్స్‌లలో పని పూర్తిగా నిలిచిపోయిందని తెలిపారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ కార్మికులతో పాటు స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(సెయిల్‌) కార్మికులు సమ్మెలో పాల్గొన్నట్లు స్టీల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ) తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో తమ ప్లాంట్లు, గనుల్లో పనిచేసే వేలాదిమంది కార్మికులు విధులకు హాజరు కాలేదని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పీకే దాస్‌ చెప్పారు. ఉక్కు ఉత్పత్తిపై సమ్మె ప్రభావం తీవ్రంగా పడిరదని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img