Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

పాల ఉత్పత్తిలో భారతదే అగ్రస్థానం : మోదీ

బనస్కాంత (గుజరాత్‌): పాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత్‌ ఏటా రూ. 8.5 లక్షల కోట్ల విలువైన పాలను ఉత్పత్తి చేస్తుందని, ఇది బియ్యం, గోధుమల అమ్మకాల మొత్తం కన్నా ఎక్కువని చెప్పారు. పాడి పరిశ్రమ ద్వారా చిన్న రైతులే అత్యధిక లబ్ధి పొందుతున్నారని ప్రధాని తెలిపారు. బనస్కాంత జిల్లా డియోధర్‌లో మంగళవారం కొత్త డెయిరీ కాంప్లెక్స్‌, బనాస్‌ డెయిరీ బంగాళదుంప ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ‘నేడు, భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారు… కోట్లాది మంది రైతులు పాలపై ఆధారపడి జీవిస్తున్నారు… భారతదేశం ఏటా రూ. 8.5 లక్షల కోట్ల విలువైన పాలను ఉత్పత్తి చేస్తుంది… పెద్ద ఆర్థికవేత్తలతో సహా చాలా మంది దీనిని పట్టించుకోరు’ అని ప్రధాని అన్నారు. స్థానిక రైతులను బలోపేతం చేయడం, ఈ ప్రాంతంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వడం లక్ష్యంగా బనాస్‌ డెయిరీ రూ.600 కోట్ల వ్యయంతో కొత్త డెయిరీ కాంప్లెక్స్‌, బంగాళాదుంప ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ను ఏర్పాటు చేసింది. వ్యవసాయం, పశుపోషణకు సంబంధించిన కీలక శాస్త్రీయ సమాచారాన్ని రైతులకు అందించడానికి ఏర్పాటు చేసిన బనాస్‌ కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. 1700 గ్రామాలకు చెందిన 5 లక్షల మంది రైతులకు ఈ రేడియో స్టేషన్‌ ద్వారా సమాచారం అందించనున్నారు. దామాలో ఏర్పాటు చేసిన సేంద్రీయ ఎరువు, బయోగ్యాస్‌ ప్లాంట్‌ను కూడా మోదీ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img