Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రజల కోసం సరైన విధానాలను రూపొందించండి


రాహుల్‌ గాంధీ

న్యూదిల్లీ : కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ బుధవారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘స్నేహితుల కోసం ఎక్కువ ఆస్తి కూడబొట్టవద్దు. ప్రజల కోసం సరైన విధానాలను రూపొందించండి’ అని అన్నారు. కమ్యూనిటీ కిచెన్‌ పథకం అమలుకు దేశవ్యాప్తంగా ఒక విధానాన్ని రూపొందించడంపై కేంద్ర ప్రభుత్వ స్పందనపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసిన ఒక రోజు తర్వాత రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ఆకలితో చనిపోతున్న ప్రజలకు ఆహారం అందించడం సంక్షేమ రాజ్యం మొదటి బాధ్యత’ అని న్యాయస్థానం పేర్కొంటూ రాష్ట్రాలతో సమావేశం నిర్వహించేందుకు కేంద్రానికి మూడు వారాల గడువు ఇచ్చింది. కమ్యూనిటీ కిచెన్‌ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వ స్పందనపై సుప్రీం కోర్టు అసంతృప్తి వ్యక్తం చేయడాన్ని ట్యాగ్‌ చేస్తూ, ‘మిత్రుల కోసం ఎక్కువ ఆస్తిని సంపాదించవద్దు. ప్రజల కోసం సరైన విధానాలు రూపొందించండి’ అని రాహుల్‌ హిందీలో ట్వీట్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img