Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మంకీపాక్స్‌ను గుర్తించేందుకు 15 లేబరేటరీలకు శిక్షణ

మొదట్లో ఆప్రికా దేశానికి మాత్రమే పరిమితమైన మంకీపాక్స్‌ ఇప్పుడు అనేక దేశాల్లో వ్యాప్తి చెందింది. దీంతో దేశాలన్నీ ఇప్పుడీ వ్యాధితో కూడా పోరాడుతున్నాయి. తాజాగా భారత దేశంలోని కేరళలో కూడా మంకీపాక్స్‌ కేసు నమోదైంది. ఈ క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్‌ను కంట్రోల్‌ చేసేందుకు రాష్ట్రాలకు కొన్ని సూచనలు చేసింది. అలాగే వైరస్‌ను గుర్తించేందుకు 15 లేబరేటరీలకు శిక్షణ ఇచ్చినట్టు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడకల్‌ రీసెర్చ్‌ తెలియజేసింది. ఈ వైరస్‌ని గుర్తించేందుకు ఈ లేబరేటరీల్లో సిబ్బందికి పూణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ఆధ్వర్యంలో శిక్షణనిచ్చినట్లు పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img