Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోదీ ఈడీ, సీబీఐ నన్ను భయపెట్టలేవు : రాహుల్‌ గాంధీ

మంగ్లార్‌ (ఉత్తరాఖండ్‌): తనను సీబీఐ, ఈడీలు భయపెట్టలేవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అర్థమైపోయిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఆయన అహంకారాన్ని చూసి నవ్వుకుంటున్నానని తెలిపారు. మోదీ బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలను ఉత్తర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో రాహుల్‌ ప్రస్తావించారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం హరిద్వార్‌ జిల్లాలోని మంగ్లార్‌లో జరిగిన ర్యాలీలో గాంధీ మాట్లాడుతూ.. ఉత్తరాఖండ్‌లో బీజేపీ తన ముఖ్యమంత్రులను మార్చిందని, వారందరూ అవినీతిపరులు అని ‘ఒక దొంగ స్థానంలో మరొక దొంగ’ అంటూ రాహుల్‌ విమార్శించారు.
దేశంలోని రైతులు, కాంగ్రెస్‌ ఉద్యమించడం వల్లే మోఈ సర్కారు మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుందన్నారు. మోదీపై కాంగ్రెస్‌ ఒక్కటే పోరాడగలదని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో పేదలు, నిరుద్యోగుల ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ కోరుకుంటోందని. దిల్లీలో కూర్చునే రాజును కాదని ఆయన అన్నారు. గత 70 ఏళ్లలో దేశంలో కాంగ్రెస్‌ ఏమీ చేయలేదని చెప్పడం ఆయన అహంకారానికి అద్దం పడుతుందని అన్నారు. ఈ దేశం 70 ఏళ్లు నిద్రపోయిందని, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే మేల్కొందని ఆయన చెప్పాలనుకుంటున్నారా? మరి ఈ రోడ్లు ఎలా నిర్మించారు… ఈ రైలు మార్గాలను ఎలా వేశారని ఆయన ప్రశ్నించారు. ప్రధాన మంత్రి మోదీ బుధవారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రాహుల్‌ గాంధీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలకు సంబంధిత శాఖలు వివరణ ఇచ్చాయని తెలిపారు. సభలో కూర్చొనని, వినని వ్యక్తికి తాను ఎలా సమాధానం చెప్పగలనని ప్రశ్నించారు. పార్లమెంటులో తన ప్రసంగాన్ని గుర్తు చేస్తూ, మోదీ సృష్టిస్తున్న రెండు భారత దేశాల గురించి తాను మాట్లాడానని రాహుల్‌ గాంధీ చెప్పారు. ఒక భారత దేశం పారిశ్రామికవేత్తల కోసం, మరొక భారత దేశం పేదలు, నిరుద్యోగుల కోసం అని తాను చెప్పానన్నారు. మొదటిదానిలో పారిశ్రామికవేత్తలకు ఏది కావాలంటే అది దొరుకుతుందన్నారు. తాను చైనా గురించి కూడా మాట్లాడానన్నారు. పార్లమెంటులో మోదీ చేసిన ప్రసంగంలో కాంగ్రెస్‌ గురించి తప్పులు మాట్లాడారన్నారు. ఎప్పటి మాదిరిగానే తన గురించి కూడా మాట్లాడారన్నారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో స్వస్థలాలకు వెళ్లేందుకు వలస కార్మికుల కోసం బస్సులను ఏర్పాటు చేయడం తప్పు అంటున్నారన్నారు. తాము అధికారంలో లేమని, నరేంద్ర మోదీ తన పని తాను చేయరని విమర్శించారు. ప్రజలకు ఉపాధి కల్పించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి ప్రజలను నిరుద్యోగులుగా మార్చారన్నారు. ‘రాహుల్‌ గాంధీ వినడని మోదీ అన్నారు. దీని అర్థం ఏమిటంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రాహుల్‌ గాంధీపై పని చేయబోవని ఆయనకు అర్థమైపోయింది. అదే ఆయన భావం’ అని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img