Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాజస్థాన్‌లో ఎమర్జెన్సీ ఫీల్డ్‌ ల్యాండిరగ్‌ ప్రారంభోత్సవం


రాజస్థాన్‌లో జాలోర్‌లో ఉన్న నేషనల్‌ హైవేపౖౖె సుఖోయ్‌ ఎస్‌యూ-30 ఎంకేఐ ఫైటర్‌ విమానాన్ని ల్యాండ్‌ చేశారు. ఇవాళ ఎమర్జెన్సీ ఫీల్డ్‌ ల్యాండిరగ్‌ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు మౌళికసదుపాయాల్ని, నాణ్యతను పరీక్షించేందుకు విమానాల ల్యాండిరగ్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఎమర్జెన్సీ సమయంలో విమానాల కోసం ఎలా జాతీయ హైవేలను వాడాలన్న కోణంలో ఈ పరీక్ష సాగింది. దీనిలో భాగంగా సుఖోయ్‌ యుద్ధ విమానాన్ని హైవేపై ల్యాండ్‌ చేశారు. దీని తర్వాత జాగ్వార్‌ యుద్ధ విమానాన్ని హైవేపై దించారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఆర్కేఎస్‌ బదౌరియా, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌లు కూడా పాల్గొన్నారు. వైమానిక దళానికి చెందిన సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ రవాణా విమానాన్ని కూడా ల్యాండ్‌ చేశారు. ఈ విమానంలో మంత్రి రాజ్‌నాథ్‌, గడ్కరీ, ఎయిర్‌ చీఫ్‌ బదౌరియాలు ప్రయాణించారు.పలు రాష్ట్రాల్లో మొత్తం 12 హైవేలను ఎమర్జెన్సీ ల్యాండిరగ్‌ కోసం వాడనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img