Friday, April 26, 2024
Friday, April 26, 2024

రెండు బుల్లెట్లు దిగినా.. వీరోచితంగా పోరాడిన శునకం..!

మాతృదేశాన్ని రక్షించుకునే క్రమంలో ప్రాణాలు మీదకు వచ్చినా మన సైనికులు వెనకడుగు వేయకుండా వీరోచితంగా పోరాడతారు. వారి శిక్షణలో ఓ శునకం కూడా అదే తరహాలో పోరాడి వృత్తిపై తన నిబద్ధతను చాటుకుంది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ జాగిలం తీవ్రంగా గాయపడిరది. గాయాలైనప్పటికీ అది వారితో పోరాడటంతో ఇద్దరు ఉగ్రవాదాలు హతమయ్యారు.లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు దక్షిణ కశ్మీర్‌లోని తంగపావా ప్రాంతంలో నక్కినట్లు సైనికులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు వారిని గుర్తించే పనిని జాగిలానికి అప్పగించారు. దానిపేరు జూమ్‌.. దానికి ఎంతో కఠిన శిక్షణ ఇచ్చాం.. నిబద్ధతకు మారుపేరుగా ఉండేది.. గతంలో జరిగిన ఎన్నో ఆపరేషన్లలో కీలకంగా వ్యవహరించినట్లు అధికారులు వెల్లడిరచారు. తనిఖీలు చేపట్టగా జూమ్‌ ఉగ్రవాదులను గుర్తించి వారిపై దాడిచేసింది. పోరాటం చేసే క్రమంలోనే రెండు తుపాకీ బుల్లెట్లు దిగబడ్డాయి. అయినా వెరవకుండా అది పోరాటం సాగించింది. జూమ్‌ వల్ల వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న దళాలు టెర్రరిస్టులను హతమార్చాయని తెలిపారు. అనంతరం దాన్ని ఆర్మీ ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఇదే ఘటనలో సైనికులు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. జూమ్‌ ఒక్కటే కాకుండా పదులసంఖ్యలో జాగిలాలకు ఇండియన్‌ ఆర్మీ అత్యంత కఠినమైన శిక్షణను అందిస్తోంది. వీటివల్లే గతంలోను, ప్రస్తుతం పలువురు ఉగ్రవాదుల దాడులను ఇండియన్‌ ఆర్మీ నిరోధించగలుగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img