Friday, April 26, 2024
Friday, April 26, 2024

విదేశీ విరాళాలు తీసుకోలేదు: ఆల్ట్‌న్యూస్‌

న్యూదిల్లీ: చట్టాలు ఉల్లంఘించి తాము విదేశీ విరాళాలు పొందినట్లు దిల్లీ పోలీసులు చేసిన ఆరోపణలను ఆల్ట్‌ న్యూస్‌ వెబ్‌సైట్‌ సోమవారం ఖండిరచింది. వెబ్‌సైట్‌ను మూసివేసే ప్రయత్నంలో భాగంగానే తమపై అనేక ఆరోపణలు చేస్తున్నట్లు తెలిపింది. విదేశీ వర్గాల నుంచి తాము నిధులు సేకరిస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని, విదేశాల నుంచి తాము ఏనాడు విరాళాలు తీసుకోలేదని స్పష్టం చేస్తూ ఆల్ట్‌ న్యూస్‌ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు పెట్టింది. మొబైల్‌ నంబర్‌ లేదా ఐపీ అడ్రస్‌ ఉపయోగించి విదేశాల నుంచి అనేక లావాదేవీల ద్వారా రెండు లక్షల రూపాయలకు పైగా విరాళాలను ఆల్ట్‌ న్యూస్‌ అధ్వర్యంలో నడిచే ప్రావ్దా మీడియా స్వీకరించినట్లు దిల్లీ పోలీసులు ఆరోపించారు. భారతీయు బ్యాంకు ఖాతాల నుంచే తాము విరాళాలు తీసుకుంటామని, మొబైల్‌ నంబరు లేదా ఐడీ అడ్రస్‌ ద్వారా ఎప్పుడూ తీసుకోలేదని ఆల్ట్‌న్యూస్‌ వెల్లడిరచింది. విరాళాలు ఇచ్చే సంస్థల బ్యాంకు ఖాతాల ద్వారానే తాము అన్ని విరాళాలు స్వీకరిస్తామని పేర్కొంది. ఆల్ట్‌న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్‌ జుబేర్‌ను గత సోమవారం అరెస్టు చేసి 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img