Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యుత్‌ సంక్షోభంపై ప్రశ్నించిన సాక్షి

న్యూదిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ భార్య సాక్షి సింగ్‌ చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారుతోంది. రaార్ఖండ్‌లో విద్యుత్తు సంక్షోభాన్ని ప్రశ్నిస్తూ.. ‘ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తున్న వ్యక్తిగా అడుగుతున్నాను. రaార్ఖండ్‌లో ఇన్ని సంవత్సరాల నుంచి విద్యుత్తు సంక్షోభం ఎందుకు ఉంది..? విద్యుత్తును ఆదా చేయడంలో మా బాధ్యతను మేం సక్రమంగా నిర్వర్తిస్తున్నాం’ అంటూ సాక్షి ట్విట్‌ చేశారు. రaార్ఖండ్‌లో చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏప్రిల్‌ 28 తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. రాష్ట్రంలో బొగ్గు కొరత కారణంగా ఏర్పడ్డ విద్యుత్తు సంక్షోభం, పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్‌ను అధిగమించడానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img