Friday, April 26, 2024
Friday, April 26, 2024

శివసేన శ్రేణులను చీల్చడం కాషాయ పార్టీ కుట్రలో మరో భాగం : సంజయ్‌రౌత్‌

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేనకు చెందిన ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారించనున్నది. ఈ క్రమంలో శివసేన నేత సంజయ్‌ రౌత్‌ దిల్లీలో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రను మూడు ముక్కలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, శివసేన శ్రేణులను చీల్చడం కాషాయ పార్టీ కుట్రలో మరో భాగమన్నారు. రాష్ట్రం వరదలతో పోరాడుతుంటే సీఎం ఏక్‌నాథ్‌ షిండే శివసేన పార్లమెంటరీ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.పార్టీ, గుర్తు కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడొచ్చు.. వారు మాత్రమే శివసేనను తయారు చేయలేరన్నారు. భవిష్యత్‌లో ఏ ఎన్నికల్లోనైనా రెబల్స్‌ గెలవడం కష్టమేనన్నారు. పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఎన్నో ఏళ్లుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అందించిన సహాయాన్ని రెబల్స్‌ నేతలకు గుర్తు చేశారు. షిండే బీజేపీ సీఎం అయినందునే ఢల్లీి పర్యటనలు చేయాల్సి వచ్చిందని సంజయ్‌ రౌత్‌ ధ్వజమెత్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img