Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సొంతపార్టీపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం

తుమకూరు : సొంతపార్టీయే తనను మోసం చేసిందని బీజేపీ ఎమ్మెల్యే ఏఎస్‌ జయరామ్‌(మసాలా జయరామ్‌) ఆగ్రహం వ్యక్తంచేశారు. నెలాఖరులోగా ఏదైనా ఓ మంచి బోర్డు లేదా కార్పొరేషన్‌కు చైర్మన్‌గా నియమించకపోతే బీజేపీని వీడతానని హెచ్చరించారు. ‘పార్టీ నన్ను పూర్తిగా మోసం చేసింది. అందుకే బీజేపీలో ఉండాలని కోరుకోవడం లేదు. పార్టీ నన్ను గుర్తించి ఓ మంచి కార్పొరేషన్‌కు చైర్మన్‌ను చేయాలి. అలా జరగకపోతే ఏమి చేయాలో నాకు బాగా తెలుసు. చాలాకాలంగా అడుగుతున్నాను. ఇంతకాలం వేచిచూశాను. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పాను. ముఖ్యమంత్రిని అడిగాను. ఎవరూ ఇంకా సానుకూలంగా స్పందించలేదు. ఇక సహనం నశిస్తోంది’ అని తువరకెరె బీజేపీ ఎమ్మెల్యే జయరామ్‌ స్పష్టంగా చెప్పారు. జయరామ్‌ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ పార్టీ తనను నిర్లక్ష్యం చేస్తే తాను అందులో ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. తన సహనానికి పరిమితి ఉంటుందన్నారు. నెలాఖరులోగా కొత్త పదవి ఇస్తానని పార్టీ నాయకత్వం చెప్పాలని డిమాండు చేశారు. అప్పటి వరకు వేచిచూస్తానన్నారు. తాను మంత్రి పదవి కోరుకోవడం లేదన్నారు. జయరామ్‌ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర సుగంధద్రవ్యాల అభివృద్ధి బోర్డు చైర్మన్‌గా కొనసాగుతున్నారు. తన నియోజకవర్గ ప్రజలకు చాలా సేవ చేశానని, దీనిపట్ల తనకు సంతృప్తి ఉందని జయరామ్‌ చెప్పారు. ‘నెలాఖరు వరకు గడువు విధిస్తున్నాను. ఈ విషయం ముఖ్యమంత్రికి చెప్పాను. జిల్లా ఇన్‌చార్జి మంత్రికి స్పష్టంచేశాను. నేను స్వతంత్రంగా పనిచేయాలి’ అని ఆయన స్పష్టంచేశారు.దయమే జిల్లా జైలుకు వెళ్లి నిందితులు దాస్‌, లతీఫ్‌, భారతీలను పోలీసు కస్టడీకి తీసుకున్నారు. నిందితులను ముందుగా క్రైమ్‌బ్రాంచ్‌ ఆఫీసుకు…అక్కడి నుంచి ఘటనాస్థలానికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img