Friday, April 26, 2024
Friday, April 26, 2024

హమ్మయ్య..! ఇక ఎండలు కాస్త తగ్గుతాయట..!

చల్లని కబురు చెప్పిన భారత వాతావరణ శాఖ
వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం కలిగించే విషయాన్ని భారత వాతావరణ శాఖ వెల్లడిరచింది. సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పడతాయని ప్రకటించింది. రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. దిల్లీి, పంజాబ్‌, హర్యానా, చండీగఢ్‌, దక్షిణ ఉత్తరప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మే 2వ తేదీ నుంచి వేడి తీవ్రత తగ్గుతుందని వాతావరణ శాఖ ట్విట్టర్లో ప్రకటించింది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాజస్థాన్‌లోని పశ్చిమ భాగం, మహారాష్ట్రలోని విదర్భ మినహా దేశంలో మరెక్కడా వడగాలులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ సీనియర్‌ సైంటిస్ట్‌ ఆర్కే జెనామణి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img