Friday, April 26, 2024
Friday, April 26, 2024

18.58 భారతీయ వాట్సాప్‌ ఖాతాలపై నిషేధం

ముంబై: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌.. 18 లక్షలకు పైగా భారతీయ ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది. వినియోగదారుల ఫిర్యాదుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్‌ వెల్లడిరచింది. ‘2022 జనవరి 1-31వ తేదీ వరకు వినియోగదార్ల నుంచి వాట్సాప్‌ గ్రీవెన్స్‌ సెల్‌కు 495 భారతీయ ఖాతాలపై ఫిర్యాదులు అందాయి. వచ్చిన ఫిర్యాదుల్లో 285 అకౌంట్లను రద్దు చేయాలని వినతులు అందాయి. వాటిలో ఖాతాదారుల ఫిర్యాదు మేరకు… 24 ఖాతాలను రద్దు చేశాం. వాట్సాప్‌ యాప్‌లో పొందుపరిచిన టూల్స్‌, ఇతరత్రా వాటితో దురుసుగా వ్యవహరించిన యూజర్ల ఖాతాలను ఐటీ నిబంధనలు 2022 ప్రకారం 18.58 లక్షల ఖాతాలపై చర్యలు తీసుకున్నాం’ అని వాట్సాప్‌ ఓ నివేదికలో వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img