Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

18 లక్షల ఖాతాలపై వాట్సాప్‌ నిషేధం

న్యూదిల్లీ: మార్చిలో 18 లక్షల భారతీయుల ఖాతాలపై వాట్సాప్‌ నిషేధం విధించింది. వినియోగదారుల ఫిర్యాదులు, కొంతమంది నిబంధనల ఉల్లంఘనల ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడిరచింది. వాట్సాప్‌ నెలవారీ నివేదికలో ఈ వివరాలు తెలిపింది. గతేడాది నుంచి అమలులోకి వచ్చిన ఐటీ నిబంధనల ప్రకారం 50 లక్షల వినియోగదారులకు మించిన డిజిటల్‌ వేదికలు ఏవైనా ప్రతినెలా నివేదికలు ప్రచురించాల్సి ఉంటుంది. తమకు అందిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల గురించి వివరాలు వెల్లడిరచాల్సి ఉంది. వాట్సాప్‌ తాజా నివేదిక ప్రకారం మార్చి 1`31 మధ్యకాలంలో 18.05 లక్షల భారతీయుల ఖాతాలపై నిషేధం విధించింది. ఫిర్యాదుల్లో ఎక్కువగా దూషణల పర్వం కనిపించింది. వినియోగదారుల నుంచి లభించిన ప్రతికూల సమాచారం ఉంది. వాట్సాప్‌ తీసుకున్న చర్యలు నివేదికలో పొందుపరిచారు. G 91 ఫోన్‌ నంబరు ద్వారా భారతీయ ఖాతాను గుర్తించింది. ఫిబ్రవరిలో 14.25 లక్షల ఖాతాలను వాట్సాప్‌ నిషేధించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img