Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

26వేల ఉద్యోగాల భర్తీకి ఓకే

ఇక నుంచి ఇంటి వద్దకే రేషన్‌
పంజాబ్‌ కేబినెట్‌ నిర్ణయాలు

చండీగడ్‌: పంజాబ్‌ కేబినెట్‌ సోమవారం కీలక నిర్ణయాలు తీసుకున్నది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 26 వేల ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీనితోపాటు రేషన్‌ను ఇంటి వద్దకే తీసుకెళ్లి లబ్ధిదారులకు అందజేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ఈ నిర్ణయాలు తీసుకున్నది. కేబినెట్‌ నిర్ణయాలను ట్విట్టర్‌ వేదికగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంటి వద్దకే రేషన్‌ పథకాన్ని ఆమోదించినట్లు మాన్‌ తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 26,454 పోస్టుల నియామకానికి ఆమోదం తెలిపినట్లు హిందీలో ట్వీట్‌ చేశారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాన్‌ ప్రకటించారు. ఒక ఎమ్మెల్యే`ఒక పెన్షన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌కు మాన్‌ ఆమోదం తెలిపారు. ఇది కూడా ఎన్నికల హామీలో భాగమే. ముక్తసర్‌ జిల్లాలో పత్తి ఉత్పత్తిదారులకు రూ.41.89 కోట్ల చెల్లింపునకు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. చిన్న ట్రాన్స్‌పోర్టర్ల పన్ను చెల్లింపు కాలాన్ని మూడు నెలలు పొడిగిస్తున్నట్లు మాన్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img