Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అజంతా గుహలకు 2019 నుంచి నీటిసరఫరా బంద్‌

ఉద్యానవన నిర్వహణపై ప్రభావం
ఔరంగాబాద్‌ (మహారాష్ట్ర) : ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపునొందిన అజంతా గుహల సముదాయం వద్ద ఉద్యానవన నిర్వహణ క్లిష్టంగా మారింది. బకాయిలు చెల్లించనందుకు 2019లో నిలిపివేసిన నీటి సరఫరా ఇంకా పునరుద్ధరించబడకపోవడమే ఇందుకు కారణం. తాము గుహల్లో ఉన్న సహజ వనరుల ద్వారా తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తున్నప్పటికీ తోటపనిలో ఆటంకం ఏర్పడిరదని, భారత పురావస్తు సర్వే (ఏఎస్‌ఐ) అధికారి తెలిపారు. జనవరిలో మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య ఠాక్రే అజంతా గుహలను సందర్శించిన తర్వాత కూడా నీటి సరఫరా సమస్య పరిష్కారం కాలేదు. మహారాష్ట్ర జీవన్‌ ప్రాధికారన్‌ (ఎంజేపీ) ద్వారా అజంతా గుహల ప్రదేశానికి నీరు సరఫరా అవుతుంది. కానీ మహారాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎంటీడీసీ) చెల్లించాల్సిన బకాయిల కారణంగా 2019లో నీటి సరఫరా నిలిపివేయబడిరదని అధికారి తెలిపారు. ఏఎస్‌ఐ సూపరింటెండెంట్‌ (ఔరంగాబాద్‌ సర్కిల్‌) మిలన్‌ కుమార్‌ చౌలే మాట్లాడుతూ… ఎంటీడీసీ ద్వారా 3.2 కోట్ల పెండిరగ్‌ బకాయిలను ఎంజేపీకి చెల్లించాల్సి ఉందని చెప్పారు. నీటి సరఫరా లేనందున అధిక సంఖ్యలో పర్యాటకులు సందర్శించే ఉద్యానవనం నిర్వహణకు ఆటకం ఏర్పడిరదని ఆయన పేర్కొన్నారు. అజంతా గుహలను సందర్శించిన సమయంలో ఆదిత్య ఠాక్రేకి సమస్యను వివరించినా ఇంకా పరిష్కారం కాలేదని చౌలే చెప్పారు.
తక్కువ నీరు అవసరమయ్యే 3-4 బయో టాయిలెట్లను ఏర్పాటు చేసేందుకు ఏఎస్‌ఐ యోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రణాళిక ఇంతకుముందు హైదరాబాద్‌, ముంబైలలో విజయవంతమైందని అన్నారాయన.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img