Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఇటుక బట్టీలో చిమ్నీ పేలుడు.. పెరుగుతున్న మృతుల సంఖ్య

కాగామోతిహారి లోని రామ్‌ గర్వా ప్రాంతంలోఉన్న ఇటుక బట్టీలో చోటు చేసుకున్న ఈ ఘటన బీహార్‌ రాష్ట్రంలో అందరినీ షాక్‌ కి గురి చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలో, చిమ్నీ లో పేలుడు సంభవించి తొమ్మిది మంది మృత్యువాత పడటంతో పాటు, అనేక మంది తీవ్ర గాయాలపాలయ్యారు.మృతులలో ఇటుక బట్టి యజమాని మహమ్మద్‌ఇష్రార్‌ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పులివెందులలో నూతనంగా నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జ్‌… కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ ఇటుక బట్టీల పేలుడు ఘటన సమాచారం అందుకున్న జిల్లా మెజిస్ట్రేట్‌,పోలీసు సూపరిండెంట్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు.రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతుంది.దాదాపు 20 మందికి గాయాలు కాగా, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఘటనా స్థలంలో అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపులోకితెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రమాద ఘటనలో మృతిచెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై స్పందించిన సీఎం నితీష్‌ కుమార్‌ .. దిగ్భ్రాంతి ఇక బీహార్‌ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఇటుక బట్టీ ప్రమాద ఘటనపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ స్పందించారు. ఇటుక బట్టీ ప్రమాద ఘటనలో ఏడుగురు మృతి చెందటంతో ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.మృతుల కుటుంబాలకు తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని కోరుతున్నానని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది.కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా ఏ ఎస్‌ పి రక్సుల్‌ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img