Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

కేరళలో కుండపోత వర్షం

నీట చిక్కుకున్న ప్రయాణికుల బస్సు
ఐఏఎఫ్‌ సహకారం కోరిన కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం: కేరళలో కుండపోతవర్షం కురుస్తోంది. రహదారులు వరద నీటితో నిండిపోయాయి. వాహనాలు నీటిలో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఐదు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరో ఏడు జిల్లాలను ఆరెంజ్‌ అలర్ట్‌ జాబితాలో ఉంచింది. రహదారులన్నీ పూర్తిగా నీటిమునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఒకటి వరద నీటిలో చిక్కుకుపోయింది. దాంతో బస్సులో నుంచి ప్రయాణికులు బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. కొండ చరియలు విరిగిపడటం, రహదారుల్నీ జలమయం కావడంతో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. దాంతో కేరళ ప్రభుత్వం భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) సహకారం కోరింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. భారీ వర్షాల కారణంగా కొట్టాయం జిల్లాలో సుమారు 12 మంది గల్లంతయినట్లు తెలుస్తోంది. ఇడుక్కి ప్రాంతంలో కారులో ప్రయాణిస్తున్న ఒక మహిళ వరద నీటిలో కొట్టుకుపోయి మరణించినట్లు తెలిసింది. పతనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిస్సూర్‌ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీచేసింది. మరో ఏడు జిల్లాలైన తిరువనంతపురం, కొల్లాం, అలప్పూజ, పాలక్కడ్‌, మలప్పురం, కోజికోడ్‌, వయనాడ్‌కు ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img