Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తన ప్రేయసి మోనాలిసాని పరిచయం చేసిన.. గే ద్యుతీ చంద్‌

దేశంలో నెంబర్‌ వన్‌ స్ప్రింటర్‌ గా కొనసాగుతున్నారు భారత అథ్లెటిక్స్‌ లో ఒడిశాకు చెందిన ద్యుతీ చంద్‌. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఎన్నో ఆటుపోట్లను దాటుకొని వచ్చి స్టార్‌ అథ్లెట్‌ గా ఎదిగింది. కొన్నేళ్ల కిందట తాను గే అని ప్రకటించి భారత క్రీడారంగాన్ని ఆశ్చర్యపరిచింది. తాను స్వలింగ సంపర్కురాలినని బహిరంగంగంగా చెప్పిన భారత తొలి అథ్లెట్‌ ఆమెనే. తాజాగా తన ప్రేయసి మోనాలిసాని పరిచయం చేసింది. ఆమెతో దిగిన ఫొటోను ట్విటర్‌ లో షేర్‌ చేసింది. దానికి ‘నిన్న నిన్ను ప్రేమించా. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నా, ఈ ప్రేమ ఎల్లప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది’ అని ట్యాగ్‌ లైన్‌ ఇచ్చింది. దాంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న పుకార్లు మొదలయ్యాయి. తన సోదరి పెళ్లి వేడుకలో మోనాలిసాతో ద్యుతీ ఈ ఫొటో దిగినట్టు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు వస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img