Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : నీతి అయోగ్‌

దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌పై నీతి ఆయోగ్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఫర్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా) హెచ్చరికలు జారీ చేసింది. వచ్చేనెల ప్రతిరోజూ 4 నుంచి 5 లక్షల కరోనా కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. కరోనా బారిన పడిన ప్రతీ వంద మందిలో 23 మంది ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితులు ఏర్పడనున్నాయని తెలిపింది. కరోనాను ఎదుర్కొనేందుకు ముందుగానే అప్రమత్తమవుతూ, వైద్య సదుపాయాలు సిద్ధం చేయాలని సూచింది. 2 లక్షల ఐసీయూ బెడ్లతో పాటు 1.2 లక్షల వెంటిలేటర్‌ కలిగిన ఐసీయూ బెడ్లు, 7 లక్షల ఆక్సిజన్‌ సిలిండర్లు కలిగిన బెడ్లు, 10 లక్షల కోవిడ్‌ ఐసోలేషన్‌ కేర్‌ బెడ్లు సిద్ధం చేయాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img