Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

నేతల మధ్య సమన్వయం కొరవడిరది : సోనియాగాంధీ

పార్టీ నేతలు వ్యక్తిగత అజెండాలను పక్కన పెట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానలపై సమష్టిగా పోరాడాలని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ పిలుపునిచ్చారు. మంగళవారం ఢల్లీిలోని ఐఏసీసీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంఛార్జీలు, రాష్ట్ర శాఖల అధ్యక్షులతో సోనియాగాంధీ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆమె పార్టీ నేతలకు క్రమశిక్షణ, ఐక్యతకు సంబంధించి పలు సూచనలు చేశారు. ‘విధానపరమైన విషయాలపై స్పష్టమైన అభిప్రాయంతో ఉండండి. కానీ, ఒక్కొక్కరు ఒక్కో ఎజెండా పెట్టుకుని మాట్లాడితే మంచిది కాదు. అది పార్టీకి నష్టం కలిగిస్తుంది. అలాంటి పనులు చేయకండి’ అని ఆమె నేతలకు సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ సందేశం కిందిస్థాయి కార్యకర్తలకు చేరడం లేదని, విధానపరమైన విషయాల్లో రాష్ట్ర నాయకుల మధ్య సమన్వయం కొరవడిరదని అభిప్రాయపడ్డారు.దీనిపై వారి అభిప్రాయాలు స్పష్టంగా లేవని గ్రహించినట్లు చెప్పారు. ప్రభుత్వ దుర్మార్గాలపై పోరాటాన్ని రెట్టింపు చేయాలన్నారు. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే వారి అసత్యాలు, ప్రచారాలను గుర్తించి ప్రజల ముందుకు తీసుకెళ్లాలని చెప్పారు. ఈ సమావేశానికి రాహుల్‌ ప్రియాంకతోపాటు ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img