Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

బ్యాంకు నుంచి రూ.12 కోట్లు కొల్లగొట్టిన ఘరానా దొంగ అరెస్టు

బ్యాంకులో కోట్లు చోరీ చేసి వేషం మార్చి తప్పించుకుని తిరుగుతున్న ఘరానా మోసగాడ్ని మహారాష్ట్ర పోలీసులు చాకచాక్యంగా అరెస్ట్‌ చేశారు. థానే ఐసీఐసీఐ బ్యాంకులో జులై 12న చోరీకి పాల్పడిన దొంగల ముఠా.. రూ.12 కోట్లు ఎత్తుకెళ్లింది. ఈ ముఠాకు చెందిన 43 ఏళ్ల అల్తాఫ్‌ షేక్‌ను పుణే పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతడి వద్ద నుంచి రూ. 9 కోట్లను రికవరీ చేసినట్టు వెల్లడిరచారు. ఈ కేసులో అల్తాఫ్‌ సోదరి నీలోఫర్‌ సహా ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంకులో కస్టోడియన్‌గా పనిచేస్తున్న అల్తాఫ్‌.. బ్యాంక్‌ లాకర్‌ తాళాలకు కేర్‌ టేకర్‌గా ఉన్నాడు. అయితే, ఈ దోపిడీకి సంవత్సరం పాటు అల్తాఫ్‌ ప్లానింగ్‌ చేశాడు. ఏసీ డక్ట్‌ను కొంచెం వెడల్పు చేసి.. దాని ద్వారా డబ్బులు వేస్తే నేరుగా పక్కనున్న చెత్తకుప్ప వద్ద పడేలా ఏర్పాటు చేశారు. చోరీ సమయంలో సీసీటీవీ ధ్వంసం చేసి.. అలారం సిస్టమ్‌ను డీయాక్టివేట్‌ చేశాడు. అనంతరం బ్యాంక్‌ వాల్ట్‌ను తెరిచి డబ్బు కొట్టేసి ఏసీ డక్ట్‌ ద్వారా బయటకు పంపించాడు. అయితే, నగదు పోయినట్టు బ్యాంక్‌ అధికారులు గుర్తించిన తర్వాత ఈ దోపిడీ వెలుగులోకి వచ్చింది.చోరీ వెలుగులోకి వచ్చిన వెంటనే షేక్‌ పరారయ్యాడు. ఆ తర్వాత తనను ఎవరూ గుర్తించకుండా బుర్ఖా వేసుకుని మారువేషయంలో తిరగడం ప్రారంభించాడు. ఇదే సమయంలో అల్తాఫ్‌ కదలికలు పూర్తిగా తెలిసిన అతడి సోదరి నీలోఫర్‌ కొంత డబ్బును తన ఇంటికి తరలించింది. ఈ కేసులో ఆమెను కూడా భాగస్వామి అయినట్టు గుర్తించిన పోలీసులు అరెస్ట్‌ చేశారు. అబ్రార్‌ ఖురేషీ (33), అహ్మద్‌ ఖాన్‌ (33), అనుజ్‌ గిరి (30) అనే మరో ముగ్గుర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.నిందితుడ్ని పుణేలో సోమవారం అరెస్ట్‌ చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ.9 కోట్లు అతడి నుంచి స్వాధీనం చేసుకున్నామని, మిగతావి త్వరలోనే రికవరీ చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img