Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మరో పదిమంది పర్వతారోహకుల మృతదేహాలు లభ్యం

ఉత్తరాఖండ్‌ సీఎం
ఉత్తరాఖండ్‌లో హిమపాతం సంభవించి మంచు దిబ్బల కింద చిక్కుకున్న పర్వతారోహకుల కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతున్నది. నాలుగు రోజుల నుంచి గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా ఇప్పటివరకు మొత్తం 19 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి తెలిపారు. మిగతా పది మంది కోసం సెర్చింగ్‌ కొనసాగుతన్నదని చెప్పారు.కశ్మీర్‌లోని ఓ మౌంటెనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్న ట్రెయినీ పర్వతారోహకులు గత మంగళవారం ఉదయం 9 గంటలకు ఉత్తరకాశీలోని ఓ పర్వతం బేస్‌ క్యాంప్‌కు చేరుకున్నారు. అనంతరం పర్వతాన్ని అధిరోహించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో 16 వేల అడుగుల ఎత్తుకు వెళ్లిన తర్వాత ఒక్కసారిగా హిమపాతం సంభవించింది.ట్రెయినీ మౌంటెనీర్స్‌ అంతా ఆ మంచు దిబ్బల కింద గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దించారు. ఆర్మీ, నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌, ఉత్తరాఖండ్‌ స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌, ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ తదితర బృందాలు సహాయక చర్యులు నిర్వహిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img