Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మీడియా..సొంత న్యాయస్థానాలను నిర్వహిస్తోంది : : సీజేఐ ఎన్వీ రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.. ఇవ్వాళ జార్ఖండ్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ రెండు సబ్‌ డివిజనల్‌ న్యాయస్థానాలను ప్రారంభించారు. సరైకేలా-ఖర్సవాన్‌ జిల్లాలోని చండిల్‌, గర్వాలోని నగర్‌ ఉంటరిలో ఏర్పాటు చేసిన ఈ రెండు సబ్‌ డివిజనల్‌ కోర్టులను ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దీనికోసం రాంచిలోని డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జ్యుడీషియల్‌ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయస్థానాల్లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా కేసులు, పిటీషన్ల గురించి తాను చాలా సందర్భాల్లో ప్రస్తావించానని, సత్వర న్యాయం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. న్యాయమూర్తులు తమ పూర్తి శక్తి సామర్థ్యాల మేరకు విధులను నిర్వర్తించేలా మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. న్యాయమూర్తులు భౌతికంగా గానీ, వ్యక్తిగతంగా గానీ న్యాయమూర్తులు పూర్తిస్థాయిలో పని చేసే వాతావరణాన్ని కల్పించే వ్యవస్థను నెలకొల్పాలని అన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్యుడీషియరీ వ్యవస్థ ముందు ఉన్న అతి పెద్ద సవాల్‌,, ప్రాధాన్యత అంశాల తీర్పులేనని పేర్కొన్నారు. న్యాయమూర్తులు సామాజిక వాస్తవికతలను గుడ్డిగా అనుసరించలేరని సీజేఐ చెప్పారు. న్యాయవ్యవస్థ మీద పెండిరగ్‌ కేసుల భారాన్ని తగ్గించడానికి, జ్యుడీషియరీతో ఏర్పడే సంఘర్షణను నివారించడానికి ప్రాధాన్యతాంశాల వారీగా తీర్పులను ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన మీడియా.. ఇవ్వాళ సొంత న్యాయస్థానాలను నిర్వహిస్తోందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఎంతో అనుభవం ఉన్న న్యాయమూర్తులు కూడా ఇవ్వలేని నిర్ణయాలను సైతం తీసుకుంటున్నాయని వ్యాఖ్యానించారు. తప్పుడు సమాచారం, సొంత అజెండాలను డిబేట్లను నిర్వహిస్తోన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితులు ఏర్పడటం ప్రజాస్వామ్యానికి అనారోగ్యకరమైనవని ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ అనంతరం రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత కల్పిస్తుంటారని గుర్తు చేశారు. అదే విధానం న్యాయమూర్తులకు దక్కట్లేదని, ఇది దురదృష్టకరమని పేర్కొన్నారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులకు సెక్యూరిటీని కల్పించే పరిస్థితులు లేవని అన్నారు. ఈ మధ్యకాలంలో న్యాయమూర్తులపై తరచూ దాడులు చోటు చేసుకుంటోన్నాయని గుర్తు చేశారు. తాము శిక్ష విధించిన దోషులు నివసిస్తోన్న సమాజంలోనే న్యాయమూర్తులు ఎలాంటి భద్రత లేకుండా నివసిస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img