test
Monday, May 27, 2024
Monday, May 27, 2024

పోలీస్‌ ఉద్యోగ వయస్సు పరిమితిని పెంచాలి

ప్రిలిమ్స్‌ పరీక్ష 44 రోజుల నుండి 90 రోజులకు పెంచాలి ఏఐవైఎఫ్‌ డిమాండ్‌
జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా, కలెక్టర్‌కి మెమొరండం అందచేసిన ఏఐవైఎఫ్‌ నాయకులు

విశాలాంధ్ర`నెల్లూరు : ప్రిలిమ్స్‌ పరీక్ష 44 రోజుల నుండి 90 రోజులకు పెంచాలంటూ డిమాండ్‌తో ఏఐవైఎఫ్‌ నాయకులు జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద ధర్నా నిర్వహించారు.కలెక్టర్‌ కి మెమొరండం అందజేశారు. ఈ సందర్బంగా ఏఐవైఎఫ్‌ జిల్లా కన్వీనర్‌ మున్నా మాట్లాడుతూ 2018 తరువాత పోలీస్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదల చేశారని నాలుగు సంవత్సరాలుగా నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరుగుతూ నోటిఫికేషన్‌ కోసం వేచి చూస్తుంటే,ఈ రాష్ట్ర ప్రభుత్వం వయస్సు పరిమితిని పెంచకుండా నోటిఫికేషన్‌ ఇవ్వడం నిరుద్యోగులను అన్యాయం చేయడమే అని వాపోయారు, కేవలం 6511 ఉద్యోగాలకు దాదాపు 8 లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని ,పోలీస్‌ శాఖ లో ఖాళీగా వున్న మొత్తం ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేయాలనీ ,కానిస్టేబుల్‌ ఎస్సై ఉద్యోగాల వయస్సు పరిమితిని పెంచాలని, కానిస్టేబుల్‌ ఎస్సై పోస్టులకు,35వరకు పెంచాలని డిమాండ్‌ చేసారు, ఇప్పటికైనా రాష్ట్ర న్యాయం చేసే విధంగా నిర్ణయం తీసుకువాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన అభ్యర్థులను, విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హేచ్చరించారు. తెలంగాణ 3సంవత్సరాలు తమిళనాడు 4 సంవత్సరాలు ప్రభుత్వాలు వయసు పరిమితి పెంచాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా వయసు పరిమితి పెంచాలని లేని పక్షం లో రాబోయే కాలం లో అభ్యర్థులను పెద్ద ఎత్తున సమీకరించి చలో సీఎం కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు ,ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్‌ నగర అధ్యక్ష కార్యదర్శులు, గౌస్‌, వాహనాల మధు, మస్తాన్‌, గయాజ్‌, ఎన్‌ మధు, బాబు, నయీమ్‌, ముత్యాలు, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పవన్‌, శివం తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img