Friday, April 26, 2024
Friday, April 26, 2024

శవాల మీద పేలాలు ఏరుకోవాల్సిన ఖర్మ నాకు లేదు: అంబటి

పవన్‌ కళ్యాణ్‌లా పార్టీ పెట్టి.. దాన్ని చంద్రబాబు పాదాల వద్ద తాకట్టు పెట్టి.. అందుకు ప్యాకేజీగా క్యాష్‌ తీసుకునే సన్నాసి రాజకీయాలు తాను జన్మలో చేయబోనని.. మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. తనపై ఆరోపణలు చేసిన పవన్‌.. వాటిని నిరూపించాలని సవాల్‌ విసిరారు. సంబంధం లేని విషయాలను తెరపైకి తీసుకొచ్చి.. ఆరోపణలు చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు. తన సవాల్‌ను పవన్‌ స్వీకరించి.. నిరూపించాలని డిమాండ్‌ చేశారు. తాను సవాల్‌ విసిరితే.. పవన్‌కు చేతకాక పారిపోయారని అంబటి ఎద్దేవా చేశారు.శవాల మీద పేలాలు ఏరుకోవాల్సిన ఖర్మ.. రైతుల ఆత్మహత్యల పరిహారాన్ని తీసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి తనకు పట్టలేదని.. మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దగ్గర నుంచి 2 లక్షలు రూపాయలు తీసుకున్నానని నిరూపిస్తే.. తన పదవిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. తాను రూ.2 లక్షలు లంచం అడిగినట్లు చేసిన ఆరోపణలను అంబటి రాంబాబు ఖండిరచారు. ఆరోపణలు చేసిన పవన్‌ కల్యాణ్‌ నిరూపించాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొత్తం 12 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. వారికి ఒక్కొక్క కుటుంబానికి రూ.7 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలను పరిహారంగా చెల్లించినట్టు వెల్లడిరచారు. జనసేన కోసం ఇదే సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రాణాలు అర్పించిన యువకుడు మట్టం అశోక్‌ కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇచ్చి.. ఇక్కడకు వచ్చి కూడా కనీసం పలకరించలేని.. మృతుడు తండ్రి పరిహారం కోసం వస్తే.. గెంటేసిన పవన్‌ కల్యాణ్‌ .. తనపై ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img