Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్ర అప్పులు, చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి

: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఏపీ అప్పుల వివరాలను కేంద్రం నిన్న పార్లమెంటులో వెల్లడిరచిన సంగతి తెలిసిందే. దీనిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాష్ట్ర అప్పులు, చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ అప్పులు రూ.4 లక్షల కోట్లు అని లోక్‌ సభలో కేంద్రం పేర్కొందని వెల్లడిరచారు. ఏపీ కార్పొరేషన్‌ సహా అన్ని రకాల రుణాలు కలిపితే రాష్ట్ర అప్పులు రూ.8 లక్షల కోట్లకు పైగానే ఉంటాయని రామకృష్ణ అంచనా వేశారు. కార్పొరేషన్ల రుణ వివరాలను కాగ్‌ అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. బడ్జెట్‌ లెక్కల ప్రకారం 2018లో ఏపీ అప్పు రూ.2.29 లక్షల కోట్లు కాగా, ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.3.98 లక్షల కోట్లకు పెరిగిందని కేంద్ర ఆర్థికశాఖ నిన్న లోక్‌సభలో బదులిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img