Friday, April 26, 2024
Friday, April 26, 2024

మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలో విప్లవాత్మక మార్పులు

నెల్లూరు అపోలో హాస్పిటల్లో అందుబాటులోకి రోబోటిక్‌ సర్జరీ
అపోలో ఆసుపత్రి సీనియర్‌
ఆర్థోపెడిక్‌ వైద్యులు డామదన్మోహన్‌ రెడ్డి వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు:
నెల్లూరు అపోలోస్పెషాలిటీహాస్పిటల్లోఇప్పటివరకుమహా నగరాలకేపరిమితమైన రోబోటిక్‌ సర్జరీనిఅందుబాటులోకితీసుకువచ్చారు. మోకాలిమార్పిడిశస్త్రచికిత్సలు అత్యాధునిక టెక్నాలజీతో నిర్వహించే ఈ రోబోటిక్సర్జరీఇప్పటికేవిజయవంతమైంది. నెల్లూరుజిల్లాతోపాటుచుట్టుపక్కల జిల్లాల వారి సౌకర్యార్థం ఈ రోబోటిక్‌ సర్జరీ ఇప్పుడు నెల్లూరు అపోలోస్పెషాలిటీ హాస్పిటల్‌ లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్తోపెడిక్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌, రోబోటిక్‌ నీ రీప్లేస్మెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ మదన్మోహన్‌ రెడ్డి, నెల్లూరుఅపోలో ఆసుపత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శ్రీరామ్‌ సతీష్‌ ఆర్థోపెడిక్‌ డాక్టర్లు పమ్మి, కార్తీక్‌ రెడ్డి, పృధ్వి, వివేకానందరెడ్డి, శశిధర్‌ రెడ్డి లతో పాటు అనస్థీషియా డాక్టర్‌ శ్రీనివాసన్‌ లు మాట్లాడుతూ గతంలో నిర్వహించే మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలో అనేక ఇబ్బందులు ఉండేవని అన్నారు. అయితే రోబోటిక్‌ మోకాలి మార్పిడి సర్జరీ ద్వారా, కచ్చితత్వంతో పాటు, రోగికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడం, నొప్పికోత తక్కువగాఉండడం,త్వరగారికవరీ కావడం వంటివి ఎంతో మేలు చేస్తాయని అన్నారు.ఈరోబోటిక్‌ సర్జరీ లో ముందుగా కంప్యూటర్లో 3%ణ% నమూనాను రూపొందించుకుని, ఆ తరువాత రోగి సిటీ స్కాన్‌ ఆధారంగా ఏ భాగంలో ఆపరేషన్‌ చేయాలో ఒక ఖచ్చితమైన వర్చువల్‌ ప్లానింగ్‌ ఏర్పాటు చేసుకొని రోబోటిక్‌ ఆర్మ్‌ అసిస్టెండ్‌ టెక్నాలజీ ద్వారావైద్యులుఆపరేషన్విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పారు. దీని ద్వారా రోగి త్వరగా కోలుకోవడంతోపాటు, శాస్త్ర చికిత్స అనంతరం కూడా నొప్పి లేకుండా, తనసాధారణకార్యకలాపాలనుకొనసాగించుకోగలుగుతారని వెల్లడిరచారు. మహా నగరాలకేపరిమితమైనఈమోకాళ్ళమార్పిడి రోబోటిక్‌ సర్జరీని నెల్లూరు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులోకి తీసుకువచ్చామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ రోజే నెల్లూరులోని అపోలో స్పెషాలిటీ ఆసుపత్రిలో మొదటి రోబోటిక్‌ మోకాలి మార్పిడి సర్జరీ డాక్టర్‌ మదన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలో డాక్టర్‌ శశిధర్‌ రెడ్డి ద్వారా విజయవంతంగా జరిగడం విశేషం.ఈ కార్యక్రమంలోఅపోలోఆసుపత్రివైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img