Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

జిల్లాలో వైసిపి అభ్యర్థులు దాదాపుగా అందరూ సిటింగ్ ఎమ్మెల్యేలే..

విశాలాంధ్ర బ్యూరో- నెల్లూరు:త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ప్రకటించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ 175 మంది అభ్యర్ధులను, 25 పార్లమెంటు స్థానాలకు గానూ 24 పార్లమెంటు స్థానాలకు అభ్యర్ధులను ఇవాళ ప్రకటించారు. మధ్యాహ్నం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్ధనలు నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతరం జాబితాను విడుదల చేశారు. జాబితాలోని పేర్లను మంత్రి ధర్మాన ప్రసాదరావు చదివి వినిపించారు. నెల్లూరు పార్లమెంటు స్థానానికి వేణుంబాక విజయసాయి రెడ్డి, తిరుపతి పార్లమెంటు స్థానానికి సిట్టింగ్ ఎంపి మద్దెల గురుమూర్తిని అభ్యర్ధులుగా ప్రకటించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు గానూ పెద్దగా మార్పులేవి చేయలేదు. 5 మంది సిట్టింగ్ లకు అక్కడే టిక్కెట్లు ఖరారు చేయగా మిగిలిన 5 చోట్ల ప్రస్తుతం ఇంఛార్జులుగా కొనసాగుతున్న వారికే అవకాశం కల్పించారు. నెల్లూరు సిటీ నుండి ఖలీల్ అహ్మద్, నెల్లూరు రూరల్ నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి నుండి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కోవూరు నుండి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, కావలి నుండి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆత్మకూరు నుండి మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నుండి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరి నుండి నేదురుమల్లి రాం కుమార్ రెడ్డి, గూడూరు నుండి మేరుగ మురళీధర్, సూళ్లూరుపేట నుండి కిలివేటి సంజీవయ్యలు పోటీ చేయనున్నారు. ఇక ఇటీవలే నెల్లూరు జిల్లాలో చేరిన కందుకూరు నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డిని తప్పించి ఆయన స్థానంలో బుర్రా మధుసూదన్ యాదవ్ ను పోటీకి దించారు. మొత్తానికి ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంభందించి టికెట్ల కేటాయింపు విషయంలో వైసీపి పెద్దగా మార్పులేమీ చేయలేదు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే ఆనీల్ కుమార్ యాదవ్ కు నరసారావుపేట పార్లమెంటు అభ్యర్ధిగా ప్రకటించారు. ఆయన స్థానం ఖలీల్ అహ్మద్ ను పోటీకి పెట్టారు. వైసీపి ఎమ్మెల్యేగా ఉన్న ఉదయగిరి మేకపాటిచంద్రశేఖర్ రెడ్డి, వెంటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలు టిడిపి చెంతకు చేరడంతో ఆయా స్థానాల్లో వేరే వారికి అవకాశం కల్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img