Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సర్వేపల్లి మినహా మిగతా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టిడిపి

విశాలాంధ్ర బ్యూరో నెల్లూరు: తెలుగుదేశం పార్టీ 34 మంది అభ్యర్ధులతో రెండో జాబితా విడుదల చేసింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా, కందుకూరుకు సంభందించి మొత్తం 11 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొదటి జాబితాలో 6 స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్ధులను పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. జిల్లాకు సంభందించి ఇక 5 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉండగా ఇవాళ వాటిలో నాలుగు స్థానాలకు చంద్రబాబు అభ్యర్ధులను ఖరారు చేసి ప్రకటించారు. పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గాన్ని మాత్రం పెండింగ్ లో పెట్టారు. జిల్లాల పునర్విభజన తర్వాత నెల్లూరుజిల్లాలో చేరిన కందుకూరు నియోజకవర్గ టిడిపి అభ్యర్ధిగా ఇంటూరి నాగేశ్వరరావు పేరును ఖరారు చేశారు. వెంకటగిరి నుండి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె కురుగొండ్ల లక్ష్మీ ప్రియను ఎంపిక చేశారు. కోవూరు స్థానానికి ఇటీవలే టిడిపిలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఎంపిక చేశారు. ఇక ఆత్మకూరుకు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేరును చంద్రబాబు ఖరారు చేశారు. జిల్లాకు సంభందించిన ఒక్క సర్వేపల్లి మాత్రమే పెండింగ్ లో ఉంది. మొదటి విడతలో నెల్లూరు సిటీ నుండి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావలి నుండి కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి నుండి కాకర్ల సురేష్, గూడూరు నుండి పాశం సునీల్, సూళ్లూరుపేట నుండి నెలవల విజయశ్రీ పేర్లను చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img