Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

150 మంది విద్యార్థులకు ఉచి త బస్సు పాస్ లు పంపిణి

విశాలాంధ్ర – రాపూరు:రాపూరు మండలం లోని గోనుపల్లి గ్రామ ములోని ప్రాధమికోన్నత పాఠ శాల 150 మంది పెద విద్యార్థు లకు శ్రీ పెంచలకోన క్షేత్ర మాజీ పాలకవర్గ చైర్మన్ ప్రస్తుత రాపూ రు మండల వ్వవసాయ కమిటి సలహ మండలి చైర్మన్ నెల్లూ రు రవీంద్రారెడ్డి తమ సోంత నిధులతో 150 మంది విద్యార్థు లకు బస్సు పాసులు పంపిణి చెసారని,ప్రాదమికోన్నత పాఠ శాల ప్రధానోపాధ్యాయులు నాగేంద్రకుమార్ తెలియజెసా రు.ఈ సందర్బంగా నాగేంద్రకు మార్ మాట్లాడుతూ పాఠశాల లో అదనపు తరగతి గదులు నిర్మాణం కొరకు రవీంద్రారెడ్డి రావడం జరిగింది. అలాగే పాఠశాల ఉన్నత పాఠశాల గా అప్ గ్రేడ్ కావడం పట్ల హర్షం వ్యక్తం చేయడం జరిగింది.ఈ కార్యక్రమములో మండల విద్యాశాఖాధికారి గుండవోలు శ్రీనువాసులు, తమ అభిమా నాన్ని విద్యార్థులు, ఉపాద్యా యులు పై చూపడం జరిగింది. గతంలో కంటే గోనుపల్లి పాఠశా ల అన్ని రకాలుగా ముందుకు వెళుతున్నది అని, 100 అడ్మిష న్లు పూర్తి చేసుకున్నందుకు అభినందించారు. గ్రామ మాజీ సర్పంచి, వైఎస్ఆర్ సిపి నాయ కులు నెల్లూరు శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశా లలు బాగా అభివృద్ధి చెందు తున్నవని ,అందుకు నిదర్శనం గోనుపల్లి పాఠశాల అని తెలిపా రు.ప్రధానోపాధ్యాయులు నాగేం ద్ర కుమార్ మాట్లాడుతూ,పాఠ శాలను అన్ని రకాలుగా అభివృ ద్ధి కి సహకారాన్ని అందిస్తూ , పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు అని రవీంద్రారెడ్డిని,ఎంఇఓని, శివకుమార్ రెడ్డిని, ఉపాద్యా యులు ,ప్రధానోపాధ్యాయులు మరియు విద్యార్థులు సన్మానిం చారు.బస్సుపాస్ పంపిణి లో ఆర్టీసీ కోఆర్డినేటర్స్ మొరళి ఇ తరులు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img