Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వైసీపీ సీనియర్ నేత,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పార్టీకి రాజీనామా

విశాలాంధ్రబ్యూరో-నెల్లూరు:వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ మేయర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రూప్ కుమార్ యాదవ్ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నెల్లూరు నగరంలోని స్థానిక జేమ్స్ గార్డెన్లోని కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసినమీడియాసమావేశం లో ఆయన మాట్లాడుతూగత13 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనిక్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేశానన్నారు.ఇటీవలవైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోజరుగుతున్న
పరిణామాలనేపథ్యంలోఈనిర్ణయం తీసుకున్నాననితెలిపారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన దగ్గర్నుంచి పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తన రక్తాన్ని చెమటగా మార్చి పనిచేశానన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తమ సొంత పార్టీగా భావించామని, ప్రతిపక్షాలతో నిరంతరం పోరాటం చేశానన్నారు. మార్పుసహజంమార్పుఅనివార్యమని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కార్ల్ మార్క్స్ ఎప్పుడో చెప్పారన్నారు. వైసిపి కోసం పునాదులుగా పనిచేస్తే గత ఒకటి న్నర సంవత్సరాలగా కొన్ని రాజకీయ పరిస్థితులుతననుబాధపెట్టాయన్నారు.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి
రాజీనామా చేయడం ఎంతో బాధాకరమైన విషయమన్నారు. రాజీనామా ప్రకటన చేస్తున్నప్పుడు రూప్ కుమార్ యాదవ్ కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే తాను తన రాజకీయ ప్రస్థానాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కొనసాగుతానని రూప్ కుమార్ యాదవ్ తెలిపారు
రూప్ కుమార్ తో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా పార్టీకి రాజీనామా చేసి రూప్ కుమారు యాదవ్ వెంట నడుస్తామని తెలిపారు. ప్రస్తుతం నెల్లూరు కార్పొరేషన్ లో వైసీపీ కి చెందిన పలువురు కార్పొరేటర్లు రాజీనామా చేయడంతో కార్పొరేషన్ లో ప్రతిపక్ష బలం పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img