Friday, April 26, 2024
Friday, April 26, 2024

టిడ్కో గృహాల లో ఉన్న సమస్యలను పరిష్కరించండి

అరిగెల నాగేంద్ర సాయి, సి.పి.ఐ నగర కన్వీనర్

టిడ్కో గృహాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని , సి.పి.ఐ నగరసమితి ఆధ్వర్యములో టిడ్కో నివాసితులు ,మంగళవారం నెల్లూరు నగర మునిసిపల్ కర్పోరేషన్ ఆఫీసు వద్ద నిరసన తెలిపి , కమీషనర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సి.పి.ఐ నెల్లూరు నగర కన్వీనర్ అరిగెల నాగేంద్రసాయి మాట్లాడుతూ , డిట్కో ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భగత్ సింగ్ కాలనీ వద్ద సుమారు అయిదువేల మందికి ఇళ్లు మంజూరు చేశారు ,ప్రజలు తమ సొంత ఇంటి కల గా అక్కడ అడుగుపెట్టారు అయితే అక్కడ ప్రారంభంనుంచి సమస్యల వలయంలో చిక్కుకున్నట్లుగా టిడ్కో గృహాల్లో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి

ప్రధానంగా అక్కడున్న సమస్యలు:

త్రాగునీరు కు బదులుగా కుళాయిల్లో బురద నీరు వస్తున్నది, డిట్కో పరిసర ప్రాంతాలలో పందుల సంచారం ఎక్కువగా ఉంది, దీనివలన జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి, వీధి లైట్లు సరిగాలేవు దీనివలన విషప్పురుగులు ఎక్కువై ప్రజలు ప్రాణభయంతో జీవిస్తున్నారు, నిర్మాణలోపం ,నిర్లక్ష్యం వల్ల డ్రెయినేజీ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ఉంది మురుగునీరు ఇళ్ల గుండా రోడ్ల మీదకు వచ్చేస్తున్నాయి.దీని వలన భరించలేని దుర్వాసన గా వుంటుంది, డ్రెయినేజీ బాగుకొరకు వ్యక్తిగతంగా ప్రతినెలా ఒక్కసారైనా లబ్ధిదారులు సొంత నిధులతో రిపేరు ఖర్చుల కొరకు వేలకు వేల రూపాయలు వెచ్చిస్తున్నారు, మూడు రోజులకు ఒకసారి నీరు వదులుతున్నారు, దీనివలన కాలకృత్యాలకు స్నానాలకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వీటితో పాటు అనేక సమస్యలు అక్కడ విపరీతమైన ఎటువంటి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ప్రజలను, అధికారులు అందరూ కూడా వచ్చి ఒకసారి చూసి ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తెరిగి వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే తీర్చాలి దానితోపాటు అక్కడున్నటువంటి సమస్యల పరిష్కారానికి అధికారులందరూ కూడా నిబద్ధులై పనిచేయాలి. అక్కడున్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కమీషనర్ ను కోరడం జరిగింది. దీని మీద తదుపరి కార్యాచరణ అధికార్ల స్పందనను బట్టి సీపీఐ నగర సమితిగా తీసుకుంటామని , నివాసితులకు ఎల్లవేళల సి.పి.ఐ గా వారికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సి.పి.ఐ సీనియర్ నాయకులు వి.రామరాజు, జిల్లా సమితి సభ్యులు వాటంబేటి నాగేంద్ర, సి.పి.ఐ నగర నాయకులు షేక్.ముక్తియార్, కె.స్టాలిన్ , వి.ప్రత్యూష్ లతో పాటు నివాసితులు రసూల్ , పద్మమ్మ, మాధవి , విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img