Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సమస్యను ఫోన్లో చెప్పగానే స్పందించిన రూరల్ ఎమ్మెల్యే

మురుగు నీరు వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 41వ డివిజన్ పరిధిలోని ఇరగాలమ్మ సంగం వద్ద డ్రైన్లలో నీరు పారుదలలేక నీరు బయటకు వచ్చి, వ్యర్ధ నీరు నిల్వ కారణంగా దుర్గంధం వెదజల్లుతోందని స్థానికులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన వైసీపీ సీనియర్ నేత మిద్దె మురళీకృష్ణ యాదవ్ తదితరులను ఆ ప్రాంతానికి పంపారు. స్థానిక కార్పొరేటర్ కొవ్వాకొల్లు విజయలక్ష్మితో కలిసి ఇరగాలమ్మ సంఘంలో మురళీ కృష్ణ యాదవ్ స్థానికులు ఇబ్బందులు పడుతండడంతో సమస్యను తెలుసుకొని, కార్పొరేషన్ అధికారులకు తెలియజేసారు.కార్పొరేషన్ అధికారులతో కలసి ఆ ప్రాంతానికి చేరుకొని ప్రత్యక్షంగా పరిశీలించారు. మురుగునీరు ముందుకు వెళ్లేందుకు తీసుకోవలసిన చర్యలను చర్చించారు. ప్రోక్లైయి న్, లేదా రోబోట్ ను ఏర్పాటు చేసి కాలువలో చెత్తాచెదారాలు పూడికలు గుర్తించారు. వెంటనే ఆ పనులు ప్రారంభించేందుకు తగిన కార్యాచరణ రూపొందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img