Friday, April 26, 2024
Friday, April 26, 2024

కోవిడ్‌ కేసుల కలకలం

డాక్టర్‌ జ్ఞాన్‌పాఠక్‌

కొత్త రకం వైరస్‌ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా దేశంలో కొత్తగా కోవిడ్‌19 కేసులు పెరుగు తున్నాయి. ఇది అత్యంత ఆందోళనకరమైన అంశం. గత 140 రోజులలో ఒకేరోజు మార్చి 23వ తేదీన 1,300 కోవిడ్‌19 కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ కొత్త వైరస్‌ ప్రభావం ప్రజల్లో అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం మినహాయించి మరణాలకు కారణం కానంత వరకు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొన్నారు. దేశంలో కోవిడ్‌19 యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,605కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడిరచాయి. తాజాగా మంగళవారం నమోదైన మూడు మరణాలతో, మొత్తం దేశంలో మరణాల సంఖ్య 5,30,816 కు చేరుకుంది. కర్ణాటక, గుజరాత్‌, మహారాష్ట్రల్లో కొవిడ్‌19 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కోవిడ్‌-19 సంఖ్య తాజాగా 4,46,99,418కి చేరుకుంది. వీక్లీ పాజిటివిటీ రేటు 1.08 శాతంగా ఉన్నప్పటికీ, రోజువారీ నమోదైన కేసుల సంఖ్య రేటు 1.46 శాతానికి పెరిగింది. జాతీయ రికవరీ రేటు 98.79 శాతంగా ఉంది. దేశంలో పెరుగుతున్న జనాభాకు తగినట్లుగా ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు లేకపోవటం వలన ఈ ముప్పు ఏర్పడుతోంది. తాజాగా ఇన్‌ఫ్లుయంజా (హెచ్‌3ఎన్‌2) కేసులు కూడా పెరుగుతున్నట్లు తాజా నివేదికలు వెల్లడిరచాయి. ఈ పరిస్థితి కొంచెం ఆందోళనకరం గానే ఉంది. గత 24 గంటల్లో 89,078 పరీక్షలు చేపట్టగా, ఇప్పటివరకు 92.06 కోట్ల కోవిడ్‌-19 నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 220.65 కోట్ల డోస్‌ల వ్యాక్సిన్‌లు వేయడమైంది. దేశంలో పెరుగుతున్న కోవిడ్‌-19 పరిస్థితిని సమీక్షించ డానికి, పెరుగుతున్న ఇన్‌ఫ్లుయంజాపై ప్రధాని మోదీ తాజాగా ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అవసరమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశంలో కొంతకాలంగా కోవిడ్‌19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో కేసులను గుర్తించే పరీక్షలస్థాయి రోజుకు 90,000 కంటే తక్కువకు పడిపోయింది. ఈ పరిస్థితిలో, జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ను పెంచవలసిన అవసరం ఉంది. తీవ్ర శ్వాసకోస అనారోగ్యంకేసులకు సంబంధించిన తగిన పరీక్షలను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఉంది. 2020లో కోవిడ్‌-19 మొదటి, 2021 మధ్య కాలంలో నెలకొన్న రెండవ దశలో, దేశంలోని ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సౌకర్యాల ఏర్పాట్లు మెరుగుపడ్డాయి. అయితే కొవిడ్‌19 తగ్గుముఖం పట్టడంతో ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను కూడా తగ్గించడమైంది. అయితే తాజాగా కొత్త కేసుల సంఖ్య పెరగడంతో ఆసుపత్రి అవసరాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రధాని నిర్వహించిన తాజా సమీక్షా సమావేశంలో ఆసుపత్రులలో తగిన చికిత్సాకేంద్రాలను నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖను ప్రధాని ఆదేశించారు. కోవిడ్‌-19 మహమ్మారి సమస్య ముగిసిపోలేదని, దేశవ్యాప్తంగా కొవిడ్‌ స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని అధికారులకు గుర్తు చేశారు.
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి గతంలో అనుసరించిన ‘టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-టీకా’ కార్యక్రమం ఇప్పటికీ అనుసరణీయమే. అయితే కేసులను పరీక్షించడం, పరిశుభ్రత, ప్రమాణాల నిర్వహణ వంటి వాటిపై మరింత దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఉంది. చైనా, సింగపూర్‌, హాంకాంగ్‌, థాయిలాండ్‌, జపాన్‌ వంటి ఆసియా దేశాల్లో కొత్తగా కొవిడ్‌19 కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 22,000 ఆసుపత్రులలో ప్రయోగాత్మక చికిత్సా సౌకర్యాల ఏర్పాట్లు జరిగాయి. అయితే గత 30 రోజులుగా దేశంలో పెరుగుతున్న కేసుల దృష్ట్యా మరింత కసరత్తులు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఫిబ్రవరి మధ్యలో దేశంలో కేవలం 1000 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇది 30 రోజుల్లో 3 రెట్లు పెరిగి మార్చి మధ్యలో వారానికి 3000 కేసులకు చేరుకుంది. దేశంలో మార్చి రెండవ వారం నాటికి, ఐసిఎమ్‌ఆర్‌ గణాంకాల ప్రకారం, ఇన్‌ఫ్లుయంజా వంటివి 48 శాతం నమోదుకాగా, 33.3 శాతం కొవిడ్‌19 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ ముప్పు నుండి దేశం తనను తాను రక్షించుకోవలసిన అవసరం ఉంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉంటాయిని ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రణదీప్‌ గులేరియా సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img