Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గ్రామీణ ఉపాధికి ఎసరు

కేంద్రంలో బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అది óకారం చేపట్టిన తర్వాత మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజిఎన్‌ ఆర్‌ఇజిఎ) నిర్వీర్యం చేయడానికి పూనుకున్నది. యుపిఎ ప్రభుత్వం ఈ పథ కాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనులు లేని కాలంలోనూ అంతో ఇంతో ఆదాయం పొంది శ్రమజీవులు జీవించడానికి అవకాశం కలిగింది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ పథకం అమలు జరిగితే శ్రమ జీవులకు ఎంతైనా మేలు జరుగుతుంది. నిధుల కేటాయింపు తగ్గితే పని దినాలు సైతం తగ్గిపోతాయి. మంజూరు చేసే పని దినాల విషయంలో కేంద్రం వివక్ష చూపుతున్నదని విమర్శ ఉంది. దేశ వ్యాప్తంగా అమలయ్యే ఆ పథకానికి 20212022 బడ్జెట్‌లో రూ.98 కోట్లు కేటాయించగా 20212023 బడ్జెట్‌లో రూ.73 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. గ్రామాల్లో కూలీల ఉపాధికి ఈ పథకం కీలకంగా ఉంది. కరోనా మహమ్మారి విజృంభించిన కాలంలోనూ ఈ పథకం కాస్త ఉపయోగపడిరది. ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు. అయినప్పటికీ ఈ పథకానికి నిధుల కేటాయింపులో కోత విధించడం మోదీ ప్రభుత్వానికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్ల నిర్లక్ష్యం ఉందని స్పష్టమవుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయడానికి బదులు దిగజార్చడానికే మోదీ ప్రభుత్వ విధానం దోహదం చేస్తోంది. ఈ పథకానికి మరిన్ని నిధులు కేటాయించాలని బడ్జెట్‌ లోక్‌సభకు సమర్పించిన సమయంలోనే ఐఎంఎఫ్‌ ప్రధమ ఎండి గీతగోపీనాథ్‌ సూచించారు. అన్ని రాష్ట్రాలకూ పని దినాలను తగ్గించినట్లు సమాచారం.
ఏపీకి తగ్గిన పని దినాలు
ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం 202223 ఆర్థిక సంవత్సరానికి పని దినాలను భారీగా తగ్గించింది. ఈ పథకం క్రింద 26 కోట్ల పని దినాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, కేంద్రం 14 కోట్ల పని దినాలను మాత్రమే కేటాయించింది. ఫలితంగా ఆర్థిక సంవత్సరం చివరిలో ఈ పథకం అమలుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 202122 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 24 కోట్ల పని దినాలను పూర్తి చేసింది. ఈ అనుభవంతో 202223 ఆర్థిక సంవత్సరానికి 26 కోట్ల పని దినాలను ఏపీ ప్రభుత్వం కోరగా ఏకంగా 10 కోట్ల పని దినాలను తగ్గించి 14 కోట్ల పని దినాలనే కేటాయించారు. పని దినాలు తగ్గించడం వల్ల శ్రమ జీవుల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. నిత్యావసర వస్తువుల ధరలు అపారంగా పెరిగిన నేపథ్యంలో అసలే కుంటుతున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడుతుంది. ఏడాదికి ఏడాది డిమాండ్‌ మేరకు పని దినాలు పెంచవలసిన కేంద్రం తగ్గించటం ఎంత మాత్రం సరైంది కాదు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన పని దినాలు దాదాపు నాలుగు నెలలకే ముగిసిపోయే పరిస్థితులు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. వేసవికాలంలో వ్యవసాయ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోతాయి. ఎక్కువ భూముల్లో పంటలు పండిరచే అవకాశం ఉండదు. అందువల్ల గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎక్కువగా అమలు చేసినట్లయితే అత్యధికంగా శ్రమ జీవులకు మేలు కలుగుతుంది. పేద వర్గాలను నిర్లక్ష్యం చేసి కార్పొరేట్లకు, భారీ వాణిజ్యవేత్తలకు సహకరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం ఎంతైనా ఉంది. గత సంవత్సరం ఆగస్టు 15 నాటికి 20 కోట్ల పని దినాలను పూర్తి చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వ అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో అధిక పని దినాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే కేంద్రాన్ని కోరినప్పటికీ చివరకు తగ్గించడమే జరిగింది. ఈ సారి కేటాయించిన 14 కోట్ల పని దినాలు జులై నాటికే పూర్తి కావచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. మొదట రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల పని దినాలు కేటాయించవలసిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఆ తరవాత సవరించిన ప్రతిపాదనలలో 26 కోట్ల పని దినాలను మంజూరు చేయాలని కోరినప్పటికీ అదీ నెరవేరలేదు. చివరకు 14 కోట్లతో సరిపెట్టారు. ఎక్కువ పని దినాలను కేటాయించటానికి కేంద్రం తిరస్కరించటం వల్ల గ్రామీణ ఉపాధి దెబ్బ తింటుంది. కోవిడ్‌ సమయంలో కేంద్రం ఆకస్మికంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించటంతో వలస కార్మికులు అనేక కష్టనష్టాలకు ఓర్చి కాలినడనకన తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఈ దశలో ఎలాంటి పనులు లేకపోవటం వల్ల ఉపాధి హామీ పథకమే కొంత ఆదుకున్నది. కోవిడ్‌ మహమ్మారి విజృంభించిన రెండేళ్ల కాలంలో ఏ ఆదాయం లేని గ్రామీణ శ్రమ జీవులకు కనీస ఆర్థిక, పాదార్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించలేదు. వ్యాధిగ్రస్థులకు వైద్యాన్ని అందించటంలోను ఘోరంగా కేంద్రం విఫలమయ్యింది. లక్షలాది మంది ప్రాణాలను కోవిడ్‌ మహమ్మారి హరించినప్పుడు కూడా కేంద్రం తగిన విధంగా స్పందించలేదు. ఎడిట్‌ పేజీ డెస్క్‌

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img