Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

వ్యవస్థను ప్రశ్నిస్తే…

భరత్‌ దోగ్రా

మేధా పాట్కర్‌, ఆమె సన్నిహిత సహచరులపైనా ప్రభుత్వం కత్తి కట్టింది. ఆదివాసీల పిల్లల కోసం స్కూలు నడిపేందుకు సేక రించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నా రని, రాజకీయ`దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారనేది వీరిపై ఆరో పణ. ఇదెంత శుద్ధ అబద్ధమో దేశ ప్రజలందరికీ తెలుసు. అయినా ఎందుకిదంతా అంటే… సామాజిక న్యాయం కోసం పాటు పడు తున్న వీరిని అణచివేయాలి, వ్యవ్యస్థను ప్రశ్నిస్తున్న వారి గొంతును నొక్కేయాలి అందుకే… ఇదంతా.


వాళ్ళంతా గొప్ప పేరున్న సామాజిక కార్యకర్తలు. సమాజం కోసం, సామాజిక న్యాయం కోసం నిస్వార్థంగా పనిచేసే నిజమైన నాయకులు. పర్యావరణం కోసం, పేదల జీవితాల్లో మెరుగుదల కోసం జీవితాన్ని పణంగా పెట్టినవారు. ప్రజాభిమానం మెండుగా, దండిగా ఉన్నవారు. ఇలాంటి వారిపై రాజ్యం (ప్రభుత్వం) కక్ష కట్టింది. ఏదో సాకుతో వారిపై కేసులు బనాయిస్తోంది. అసత్య ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయిస్తోంది. జైళ్ళల్లో బంధిస్తోంది. అందులో నుండి బయటపడకుండా ప్రాణాలు తోడేస్తోంది. ఇంతకీ వారు చేసిన పాపం… సమాజం కోసం, ప్రజల కోసం పాటుపడడం, ఈ క్రమంలో వ్యవస్థలో లోపాలను ప్రశ్నించడం…..
ఇదంతా వినడానికి ఓ మంచి (కాఫీ లాంటి) సినిమా కథలా ఉంది కదా! కానీ ఇది కథ కాదు పచ్చి నిజం. ఎక్కడో కాదు.. మన దేశంలోనే, మన కళ్ళ ముందే జరుగుతున్న ఘాటైన వాస్తవం. ఏం జరిగినా మనలో చాలామంది పెదవి విప్పకుండా కళ్ళప్పగించి కంటున్న చేదు సత్యం. ప్రభుత్వ కుచ్చితానికి ఇటీవలే స్టాన్‌స్వామి బలయ్యారు. ఆయనతోపాటు జైలుకెళ్ళినవారు బెయిల్‌కూ నోచుకోక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్టాన్‌ స్వామి, వరవర రావు, సుధా భరద్వాజ్‌, దిశ రవి… ఇలా ఎందరిపైనో రాజ్యం కుట్ర కేసులు బనాయించింది. ఇప్పుడు ఈ కోవలోనే మేధా పాట్కర్‌, ఆమె సన్నిహిత సహచరులపైనా ప్రభుత్వం కత్తి కట్టింది. ఆదివాసీల పిల్లల కోసం స్కూలు నడిపేందుకు సేకరించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నా రని, రాజకీయ`దేశ వ్యతిరేక కార్యకలాపాల కోసం వినియోగిస్తున్నారనేది వీరిపై ఆరోపణ. ఇదెంత శుద్ధ అబద్ధమో దేశ ప్రజలందరికీ తెలుసు. అయినా ఎందుకిదంతా అంటే… సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న వీరిని అణచివేయాలి, వ్యవ్యస్థను ప్రశ్నిస్తున్న వారి గొంతును నొక్కేయాలి అందుకే… ఇదంతా. ఈ ఆరోపణలతో మధ్యప్రదేశ్‌లోని భిర్వాని జిల్లాలో రెండు రోజుల క్రితం మేధా పాట్కర్‌, ఆమె సహచరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మేధా పాట్కర్‌, ఆమె సహచరులకు అండగా, మద్దతుగా పౌర సమాజం వెంటనే మేల్కొంది. వందలాదిమంది కార్యకర్తలు, మేధావులు, విద్యావేత్తలు, జర్న లిస్టులు, తదితరులంతా ర్యాలీ నిర్వహించారు. ఈ మద్దతు ఇంకా విస్తృతం కావాలి. వారిపై కేసు ఉపసంహరించేవరకూ కొనసాగాలి. ప్రజల కోసం నిలబడిన మేధా పాట్కర్‌కు ప్రజలే రక్షణ రేఖ కావాలి.

దొంగే దొంగా దొంగా అని అరిస్తే… అసలు దొంగపై నుండి అందరి దృష్టీ మరలుతుంది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నదీ ఇదే. తాను చేసే తప్పుడు పనులేవీ బయటపడకుండా ఏదో రకంగా అందరి దృష్టినీ పక్కదారి పట్టిస్తోంది. పైపెచ్చు ఎలాంటి తప్పు చేయని వారిని లక్ష్యంగా చేసుకుం టోంది. ఈ పరంపరను కొనసాగిస్తూనే ఉంది. మేధాపాట్కర్‌పై కేసే తాజా ఉదాహరణ. ఆమెపై ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన వ్యక్తి బీజేపీకి మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవాడు. ఈ ఒక్క విషయం చాలు ఇదంతా అధి కార దండంతో బీజేపీ ప్రభుత్వం సాగిస్తున్న అకృత్యమే అని అర్థం చేసుకోవ డానికి. నర్మదా బచావో ఆందోళన్‌ నాయకురాలిగా మేధాపాట్కర్‌ దేశవ్యాప్తం గానే కాదు అంతర్జాతీయంగానూ అందరికీ చిరపరిచితురాలు. డ్యామ్‌ కారణంగా నిర్వాసితులైనవారి హక్కుల కోసం పోరాడిన నాయకురాలిగా లక్షలాదిమందికి ఆమె స్ఫూర్తినిచ్చారు. సామాజికంగా, పర్యవరణపరంగా ప్రతికూల ప్రభావాన్ని చూపించే విధ్వంసకర ప్రాజెక్టులపై నిర్ణయాలను ప్రశ్నిం చిన వ్యక్తిగా ఎందరికో ఆమె పూజ్యనీయురాలు. ముంబయిలోని మురికివాడ ప్రజల నివాసిత హక్కుల కోసం ఘర్‌ బచావో, ఘర్‌ బనావో ఆందోళన్‌ నిర్వ హించారు. ఇలా చెప్పుకుంటూపోతే సహచరుల సమన్వయంతో మేధా పాట్కర్‌ నిర్వహించిన సామాజిక ఉద్యమాల చరిత్ర చాలానే ఉంటుంది. ఇందులో గుర్తించదగిన మైలురాళ్ళూ చాలానే ఉన్నాయి. సొంతం గానే కాదు ఇతర సామాజిక సంస్థలు చేసిన సామాజిక ఉద్యమాల్లోనూ ఆమె, ఆమె సన్ని హిత సహచరులు కీలక భూమిక పోషించారు. ప్రజోద్యమాల జాతీయ కూటమి (ఎన్‌ఎపిఎం) గొడుగు కింద ఇతరులతో కలసి పనిచేసారు. డ్యామ్‌ లపై ప్రపంచ కమిషన్‌లో ఆమె కమిషనర్‌గానూ ఉన్నారు. బలహీన వర్గాల కీలక ప్రయోజనాలకు సంబంధించిన అనేక అంశాలపై విధాన రూప కల్పనలో ముఖ్యపాత్ర పోషించారు. ప్రత్యామ్నాయ అభివృద్ధి మార్గ అన్వే షణలో భాగంగా సృజనాత్మక పాఠశాలల నిర్వహణ, ఇతరత్రా అనేక కార్య క్రమాల కోసం ఇటీవలే నర్మదా నవ నిర్మాణ్‌ అభియాన్‌ (ఎన్‌ఎన్‌ఎన్‌ఎ) ను ప్రారంభించారు. ఇందుకు సేకరించిన నిధుల మీదే ఇప్పుడు ఎఫ్‌ఐఆర్‌ నమో దైంది. మేధాపాట్కర్‌పై కేసు నమోదు కావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇంతకుముందు 15 ఏళ్ళ క్రితం 2007లో ఒకసారి ఇలాంటి కేసే నమో దైంది. దీనిని సుప్రీంకోర్టు కొట్టేసింది. 2007లో జులై 10వ తేదీన ఈ కేసులో తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఇది స్వార్థ ప్రయోజనాల కోసం దురు ద్దేశంతో వేసిన వ్యాజ్యం అని పేర్కొంది. డ్యామ్‌ నిర్వాసితుల పునరావాసం కోసం మేధా పాట్కర్‌ పనిచేస్తున్నారంది. ఇప్పుడు మళ్ళీ ఇలాంటి కేసే ఆమె మీద, ఎన్‌ఎన్‌ఎన్‌ఎలోని ఆమె సన్నిహిత సహచరుదల మీద మోపారు. కేసు వేసింది ఎవరైనా కావచ్చు. దాని వెనక ఉన్నది మాత్రం కచ్చితంగా ప్రభు త్వమే. అధికార వర్గం అండదండలతో మేధాపాట్కర్‌పై పదేపదే అసత్య ఆరో పణలు చేయడం, కేసులు నమోదు చేయడం దారుణం, నీచం, ఆందోళన కరం. మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రల్లోని నర్మదా వ్యాలీలో నిలువ నీడ కోల్పోయిన గ్రామీణులు, ఆదివాసీల ప్రయోజనాల కోసం రెండు దశాబ్దాలుగా పోరాడు తున్న వారిపై స్వార్థ ప్రయోజనాల కోసం భయంకరమైన ఆరోపణలు చేయడం ఘోరమని ఎన్‌ఎపిఎం కూడా ప్రకటన చేసింది. నిధుల విని యోగంపై మూడు నెలల క్రితమే ఏప్రిల్‌ 6వ తేదీన ఎన్‌ఎపిఎం వివరణలతో సమాధానమిచ్చింది కూడా. అయినా ఇప్పుడు కేసు నమోదు చేయడం కుట్ర, కుత్సితం కాక మరేమిటి?
ప్రజల కోసం, పర్యావరణం కోసం శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధ్ద తుల్లో పోరాడుతున్నవారికి మరే ఇతర దేశంలోనైనా అయితే గొప్ప గౌరవం దక్కేదే. కానీ, ఇది భారతదేశం కదా! ఇక్కడ చెప్పేదొకటి చేసేదొకటి. స్త్రీలను పూజిస్తామంటూనే అణచివేస్తారు, వ్యక్తి స్వేచ్ఛకు కావలసినంత విశాలత అందిస్తామంటూనే ఆచరణలో హరించేస్తుంటారు. ఇది పేరుకి ప్రజాస్వామ్య దేశం గానీ ఇప్పుడు జరుగుతున్నది నియంతల పాలనే. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితే అందుకు తార్కాణం.
ప్రజోద్యమాల నేపథ్యంలో రైట్‌ లైవ్‌లీహుడ్‌ అవార్డు, గోల్డెన్‌ ఎన్విరాన్‌ మెంట్‌ అవార్డు, హ్యూమన్‌ రైట్స్‌ డిఫెండర్‌ అవార్డు లాంటి గొప్ప ప్రతిష్ఠాత్మక అవార్డులనే కాదు అంతకుమించిన విలువైనవి ప్రజల నుండి ప్రేమాభి మానాలు, గౌరవమర్యాదలనూ మేధాపాట్కర్‌ సంపాదించుకున్నారు. అలాంటి మేధాపాట్కర్‌కు ప్రభుత్వం చేస్తున్న గొప్ప సన్మానం కదా… ఈ అసత్య ఆరోపణలు, ఈ అక్రమ కేసులూ… మరి ఇది భారతదేశం కదా! అందులోనూ అధికారంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కదా!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img