Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

భారత్‌లో జన విస్పోటనం

జ్ఞాన్‌పాఠక్‌

ప్రపంచంలో భారతదేశ జనాభా 142.86 కోట్లకు చేరుకున్నదని స్టేట్‌ ఆఫ్‌ వరల్డ్‌ పాపులేషన్‌(ఎస్‌ఓడబ్ల్యుపీ) 2023 నివేదిక తెలియ జేసింది. ప్రపంచంలో అతి పెద్ద జనాభా భారతదేశంలో ఉందని ఈ నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికను ఐక్యరాజ్యసమితి జనాభా నిధి (యుఎన్‌ఎఫ్‌పీఏ) నివేదికను విడుదల చేసింది. పెరుగుదల జనాభాపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. భారతదేశంలో జనాభా వృద్ధిరేటు ఒక సంవత్సరంలో 1.56గా నమోదవుతోంది. ఇది అత్యధిక వృద్ధిరేటు. ఈ నేపధ్యంలో విధాన కర్తలకు జనాభా ఆందోళన కలిగిస్తోంది. ఒక మహిళ పునరుత్పాదక వయసులో కనీసం ఇద్దరు బిడ్డలకు జన్మనిస్తోందని ఇది ఆహ్వానించదగిన పరిణామమేనని, సంతానోత్పత్తి రేటు 2.1కంటే తక్కువగా ఉన్నదని ఇది మంచిదేనని భావిస్తున్నారు. ఆయు:ప్రమాణం దేశంలో పెరుగుతున్నది. అయితే సంతానోత్పత్తి రేటు పెరగకపోవడం అభిలషణీయం. మన మానవాళి కుటుంబ జనాభా 800 కోట్లు అన్న అధ్యయనంలో ఇది ఒక మైలురాయి లాంటిదని ఆనందించదగిన పరిణామమని నివేదిక పేర్కొన్నది. జనాభా పెరుగుదలపై మాత్రం ప్రజలు, విధానకర్తలు ఆందోళన పడుతున్నారు.
భారతదేశం సహా 8దేశాలలో జనాభాకు సంబంధించిన సమస్యలపై సర్వే నిర్వహించారు. సర్వేచేసిన అన్ని దేశాలలోనూ జనాభా పెరుగుదలపై ఆందోళన వ్యక్తమవుతోంది. సర్వేలో పాల్గొన్న వారిలో అత్యధికులు ఇప్పుడున్న జనాభానే చాలా ఎక్కువని అభిప్రాయ పడుతున్నారు. జపాన్‌, భారత్‌దేశం మినహా తక్కిన ఆరు దేశాలలో సంతానోత్పత్తి రేటు ఎక్కువగా ఉందన్న అభిప్రాయం సాధారణంగా వ్యక్తమైంది. బ్రెజిల్‌, ఈజిప్టు, ఫ్రాన్స్‌, హంగరీ, నైజీరియా, అమెరికా దేశాలలో ఈ అభిప్రాయం వ్యక్తమైంది. మెసేజ్‌లు, మీడియా, సాధారణ సంభాషణల ద్వారా జరిగిన సర్వేలో ఇప్పుడున్న జనాభా, సంతానోత్పత్తి రేటు, వలసలపై ఆందోళన వ్యక్తమైంది. సర్వే జరిగిన ప్రతి దేశం లోనూ మీడియా, మెసేజ్‌ల ద్వారా సమాచారం లేనప్పుడు ఎక్కువ మంది జనాభా ఇంత ఎక్కువగా ఉన్నదా అన్నవిషయం తమకు తెలియ దంటున్నారు. అత్యంత ప్రాధాన్యతగల అంశాలే ఏంటనేది ప్రశ్నించి నప్పుడు తమ తమ దేశాలలో జనాభాలో వస్తున్న మార్పుపై ఎక్కువగా ఆలోచిస్తున్నామన్నారు. హక్కుల గురించి పెద్దగా చర్చ జరగడంలేదు. అధిక జనాభా లేదా తక్కువ జనాభా పైన రాజకీయ నాయకులు, మీడియా అప్పుడప్పుడు చర్చలు జరిపి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. హక్కులు, విధానాలపైన ప్రజలు చైతన్యవంత మవుతున్నారు. అలాగే ఆర్థిక, వాతావరణ ప్రభావం జనాభాలో మార్పునకు దోహదం చేస్తున్నదని నివేదిక తెలియజేసింది.
వివిధ దేశాల ప్రభుత్వాలు నిర్వహించిన సర్వే అంచనాలను ఐక్యరాజ్యసమితికి అందించాయి. జనాభా, అభివృద్ధి, ప్రభుత్వ విధానాలపై 1963 నుంచి సర్వేలు జరుగుతున్నాయి. ఐతే 2015, 2019,2021లలో జరిగిన సర్వేలో ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎక్కువమంది పిల్లలు అవసరంలేదని అత్యధిక ప్రజలు అభిప్రాయపడుతున్నారని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న జనాభా సంఖ్య, ధోరణులపై ప్రజలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం చాలా మంచిదే. అభిప్రాయాలు వ్యక్తంచేయడం సరైందికాదు. వాస్తవంగా ఎదురవుతున్న సవాళ్లు జనాభాలో వస్తున్న మార్పుపైనే. సంతానోత్పత్తి పెరుగుదలపై పరిష్కారాలు, మానవహక్కులపై కోత లేదా జనాభాలో వస్తున్న మార్పును గుర్తించకపోవడం ఎదురయ్యే సవాళ్లు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక అనిశ్చితులలో జనాభాపై ఆందోళన వ్యక్తం కావడం అర్థంచేసుకోదగినదే. అయితే నిరాశ సమస్యలనుంచి దృష్టిని పక్కదారి పట్టిస్తుంది. సమస్యలపై దృష్టిని ప్రసరింపచేయడమే పరిష్కారానికి మార్గం. ఈ నివేదిక భయం, ఆందోళనలు సమ్మిళితంగా ఉంది. జనాభా పెరుగుదల వాతావరణ మార్పులకు, పర్యావరణ విధ్వంసానికి దారితీస్తోంది. ఇది ఆందోళన కలిగించే అంశం. అదేసమయంలో పేదరికం, ఎక్కువస్థాయిలో పెరుగుతోంది. రోజుకు పది డాలర్లలోపు మాత్రమే ఖర్చు చేయగలిగిన జనాభా 500కోట్లు ఉన్నారు. అత్యధిక పేదలున్న దేశం ప్రపంచంలో భారతదేశమేనని ఈ నివేదిక పేర్కొన్నది. భారతదేశ జనాభాలో 68శాతం 15`64ఏళ్ల మధ్య వయస్కులున్నారు. వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది. వీరికి ఆర్థిక భద్రతలేదు. మనదేశంలో మహిళా సాధికారత, పిల్లల హక్కుల రక్షణ అత్యంత తీవ్రమైన అంశాలుగా మిగిలిఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img