Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లుకు మంగళం

సురేష్‌ బాబు

దేశంలోని పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి పరిరక్షించడమే లక్ష్యంగా వ్యక్తిగత సమాచార పరిరక్షణ (పీడీపీ) బిల్లు ను కేంద్రం 2018లో తెరపైకి తెచ్చింది. నాలుగేళ్ళ సుదీర్ఘకాలం తరవాత వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్రం ఉపసంహరించుకుంది. సవరణలతో మళ్లీ ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది. సంయుక్త పార్ల మెంటరీ కమిటీ ఈ బిల్లుకు 81 సవరణలు ప్రతి పాదించడంతో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. 2019 డిసెంబర్‌ 11న ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబరులో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేసింది. ప్రజల సమాచార గోప్యతా చట్టానికి సంబంధించిన ఈ బిల్లు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విపక్షాలు విమర్శించాయి. వ్యక్తిగత డేటాను యాక్సెస్‌ చేసేందుకు ప్రభుత్వానికి అవకాశం కల్పించేలా గతంలో చట్టం ఉంది.
జాతీయ భద్రత, ఇతర కారణాల పేరుతో వ్యక్తుల వ్యక్తిగత డేటాను యాక్సెస్‌ చేయడానికి ఈ చట్టం ప్రభుత్వానికి విస్తృత అధికారాలు కల్పిస్తున్నదని విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి చాలా మినహాయింపులు ఇచ్చింది. ప్రజల వ్యక్తిగత సమాచారానికి గోప్యత కల్పించడం, ఓ ప్రాధికార సంస్థ ద్వారా రక్షణ కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం. జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలు, జాతీయ భద్రత, శాంతిభద్రతలు, దేశ సార్వభౌమత్వం, సమగ్రతకు సంబంధించిన అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తమ దర్యాప్తు సంస్థలకు ఈ చట్టం పరిధి నుంచి మినహాయింపు ఇవ్వొచ్చు.
2019 డిసెంబరులో ఇది సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ముందుకు వెళ్ళింది. ఆ కమిటీ వివిధ రంగాల నిపుణులు, భాగస్వామ్య సంస్థ లతో చర్చించి బిల్లులో అనేక మార్పుచేర్పులు చేసింది. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లోనైనా బిల్లు చట్టరూపం దాలుస్తుందా? అనేది అనుమానమే! గత ఐదు సంవత్సరాలుగా వ్యక్తిగత సమాచార గోప్యతకు సంబంధించి దేశంలో చర్చోపచర్చలు జరుగుతూనే ఉన్నాయి. జస్టిస్‌ బి.ఎన్‌.శ్రీకృష్ణ నేతృత్వంలో రూపొందించిన డేటా ప్రొటెక్షన్‌ బిల్లుని 2019లో పార్లమెంటులో ప్రవేశపెట్టి దీనికి సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు. దాదాపు రెండు సంవత్సరాల తర వాత కమిటీ తుది నివేదిక ఇచ్చింది. పౌరుల వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించ డానికి ఉద్దేశించిన ‘పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు 2019 (పీడీపీ)’ ముసా యిదాకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) తాజాగా ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఉభయ సభల ముందుకు రానుంది. గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చిచెప్పిన అనంతరం 2019 డిసెంబరులో ఈ బిల్లుకు కేంద్రం రూపకల్పన చేయడం ఏమిటి? కేంద్ర దర్యాప్తు సంస్థలు, నిఘా ఏజెన్సీలకు ఈ చట్టం నుంచి చాలా మినహాయింపులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాబోవు పార్లమెంటు సెషన్లో ప్రవేశపెట్టనున్న వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లు తీవ్రమైన ప్రతిఘటనకు దారితీస్తున్నది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సమాచార గోప్యత విష యంలో కేంద్రం చూపుతున్న వివక్షే కారణం. ఈ బిల్లు చట్టంగా మారితే కేంద్రం ప్రభుత్వానికి వ్యక్తిగత సమాచార రక్షణ విషయంలో విశేషాధికారాలు దఖలు పడనున్నాయి. ఇది అంతిమంగా నియంతృత్వానికి దారి తీసే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్న విపక్షాలు కేంద్రానికి అసమ్మతి నోట్‌ పంపాయి. దేశంలో పౌరులు, వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే విషయంలో ఆందోళనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా పెగాసస్‌ వంటి స్పైవేర్‌లను వాడటం ద్వారా కేంద్రం ఇలాంటి వ్యక్తిగత సమా చారాన్ని తీసుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతుండటం, దీనిపై సుప్రీంకోర్టు సైతం నిపుణుల కమిటీతో విచారణ చేయిస్తున్న తరుణంలో పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని రక్షించడం కేంద్రానికి సవాళ్లు విసురుతోంది. దీంతో కేంద్రం వ్యక్తిగత సమాచార రక్షణ బిల్లును తెచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇందులో పొందుపరిచిన అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
ప్రజల వ్యక్తిగత సమాచారంపై ప్రభుత్వానికి గుత్తాధిపత్యం ఉండేట్లు బిల్లు ఉందని విపక్షాల వాదన. కేంద్ర ప్రభుత్వం పౌరుల, సంస్థల వ్యక్తిగత సమా చారాన్ని రక్షించే పేరుతో తీసుకొస్తున్న బిల్లులో అంశాలపై విపక్షాలు ముందే పెదవి విరుస్తున్నాయి. ఈ బిల్లు వల్ల పౌరుల, సంస్థల వ్యక్తిగత సమాచారం రక్షణ సంగతేమో కానీ కేంద్రానికి మాత్రం వారిపై పెత్తనం చెలాయించే విశేషాధికారాలు దఖలు పడటం ఖాయమంటున్నారు. ఈ బిల్లులో పొందుపరి చిన చాలా అంశాలపై విపక్ష ఎంపీలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లు యథాతథంగా పార్లమెంటులో ఆమోదం పొందితే కేంద్రం తమకు కావాల్సిన వారి డేటాను మాత్రమే రక్షించే వీలుంటుందని, మిగతా డేటా కేంద్రం చేతుల్లోకి వెళుతుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా ఏ ఏజెన్సీని అయినా మొత్తం చట్టం నుంచి మినహాయించేలా కేంద్ర ప్రభుత్వానికి అపరిమితమైన అధికారాలను ఇది ఇవ్వడాన్ని అలాగే సెక్షన్‌ 35పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారం ఇచ్చేందుకు సమ్మతించే నిబంధనల నుంచి ప్రభుత్వం, ప్రభుత్వ సంస్థలు కొన్ని మినహా యింపులు ఇవ్వడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లును ప్రస్తుత రూపంలో పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు బిల్లులోని సెక్షన్‌ 12, 35 ప్రకారం ప్రభు త్వానికి, దాని సంస్థలకు అందించే విస్తృత మినహాయింపులపై జెపిసి కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆధునిక నిఘా నెట్‌వర్క్‌ ఏర్పాటు, ఇలా పెట్టే నిఘాతో ఉత్పన్నమయ్యే హానిపై కేంద్రం దృష్టిసారించకపోవడం, ఈ బిల్లులో అంశాలపై పార్లమెంటరీ పర్యవేక్షణ లేకపోవడం ఫ్రేమ్‌వర్క్‌ కింద వ్యక్తిగతేతర డేటా నియంత్రణ, జరిమానాల లెక్కింపులో వైఫల్యంపై ఎక్కడా ప్రస్తావించలేదని జెపిసి తెలిపింది. ఈ బిల్లులో లోపాలు ఉన్నాయి పార్లమెంటులో చర్చకు పెట్టా లని పార్లమెంటరీ కమిటీ తీర్మానించింది. ఇప్పటికే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌తో యూజర్ల డేటాను షేరింగ్‌ చేయడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రైవసీ ఉల్లం ఘన అవుతుందనే ఆందోళనల నేపథ్యంలో తాత్కాలికంగా ఈ ప్రైవసీ పాలసీ నిలిపివేస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడిరచింది. డేటా ప్రొటెక్షన్‌ బిల్లు అమల్లోకి వచ్చేంత వరకు తమ ప్రైవసీ పాలసీ తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాట్సాప్‌ యూజర్లు కూడా ఈ పాలసీని అంగీ కరించాలని ఇకపై ఒత్తిడి చేయబోమని కోరింది. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును కేంద్రం తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. సవరణలతో మళ్లీ ప్రవేశపెట్టా లని నిర్ణయించుకుంది.
వ్యాస రచయిత ప్రజా సైన్సు వేదిక అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img