Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

సాహిత్య విమర్శక రాజు రాచపాళెం

అఖిలాశ

‘‘సాహిత్య విమర్శలో వీరంగం అక్కర్లేదు. ఎంత వీరంగం చేసినా చరిత్రను వెనక్కి తిప్పలేరు. మార్పును అడ్డుకోలేరు. వాచాలత్వం మాత్రం రికార్డువు తుంది.’’ అంటే దీని అర్థం విమర్శ చేస్తున్నప్పుడు బలమైన పదాలు, అసభ్యకర మైన భావాలను, చరిత్రను వక్రీకరించడం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించే ప్రయత్నం చేయడం, నేను రాసిందే శాసనం అనే ధోరణిలో ఉండటం సాహిత్య విమర్శకు పనికిరావు. అలా ఉన్నప్పుడు సాహిత్య వేత్తలు సాహిత్య విమర్శను ఆహ్వానించలేరు. సహేతుకమైన విమర్శ, ఉన్నది ఉన్నట్టు రాస్తూ రచయిత తప్పులను సున్నిత పదాలతో మందలించగలిగితే తప్పకుండా అటు రచయితకు, ఇటు సాహిత్యానికి ఉపయోగపడుతుంది. అలాంటి విమర్శకులే రాచపాళెం. తప్పును తప్పని చెప్పడమే కాదు అది ఎందుకు తప్పో? ఎలా తప్పో చెప్పడానికి ఒక ఉదాహరణ కాకుండా అనేక ఉదాహరణలు చెప్తారు. పరుషమైన వాక్యాలతో రచయితను భయపెట్టకుండా సున్నితమైన పదాలతో తప్పును వివరించడం వారి విమర్శకున్న స్థాయి.

రచయితలు సామాజిక దృక్పథంతో సాహిత్యాన్ని సృష్టిస్తే విమర్శకులు అంతకన్నా ఎక్కువ బాధ్యతతో విమర్శను రాస్తారు. ఈ విమర్శ సాహిత్యం మీదనే ఉండాలి తప్ప రచయితల వ్యక్తిగత జీవితాల మీద కాదు. సాహిత్య విమర్శ రావడం లేదనే ప్రచారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్నది. వాస్తవానికి సాహిత్య విమర్శకులు ఉన్నారు. విమర్శ చేస్తున్నారని ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి అంటున్నారు. దాన్ని నిజం చేయడానికే విమర్శ-2009 శీర్షికతో పుస్తకాన్ని రాశారు. 2009లో వివిధ దినపత్రికలలో వచ్చిన సాహిత్య విమర్శ వ్యాసాలను గూర్చి రాసిన పుస్తకం. విమర్శకులు గురువులు లాంటి వారు అలాంటి గురువులు రాసిన వ్యాసాలను చదివి తప్పులు ఉంటే మందలించి, మంచి ఉంటే అభినందించి విమర్శ 2009 పుస్తకాన్ని రాసిన రాచపాళెంగారు గురువులకే గురువు అయ్యి వారి ఆచార్య స్థానానికి విలువ కల్పించుకున్నారు. ఒక పుస్తకాన్ని విమర్శ చేయాలంటేనే కనీసం మూడు గంటల సమయం పడుతుంది. అలాంటిది ఒక సంవత్సర కాలంలో వివిధ అంశాలపై వచ్చిన విమర్శ వ్యాసాలను సేకరించి, చదివి వాటిపై విశ్లేషణ చేయడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విధంగా చేయడం ద్వారా తెలుగు సాహిత్య విమర్శకు రాజుగా రాచపాళెం కొనసాగుతున్నారు. దాదాపుగా వంద మంది విమర్శకులను ప్రస్తావిస్తూ 200కి పైగా ఉన్న వ్యాసాలను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విభజించారు. ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక విప్లవ సాహిత్యం వరకు వచ్చిన విమర్శ వ్యాసాలను విమర్శనాత్మకంగా విశ్లేషిస్తూ రాసిన ఈ పుస్తకంలో 10 వ్యాసాలు 182 పుటలుగా ఉన్నాయి.
పుస్తకం ఎందుకు రాయాల్సి వచ్చిందో ఇలా చెప్పారు రాచపాళెం ‘‘సాహిత్య విమర్శలో వీరంగం అక్కర్లేదు. ఎంత వీరంగం చేసినా చరిత్రను వెనక్కి తిప్పలేరు. మార్పును అడ్డుకోలేరు. వాచాలత్వం మాత్రం రికార్డువు తుంది.’’ అంటే దీని అర్థం విమర్శ చేస్తున్నప్పుడు బలమైన పదాలు, అసభ్యకర మైన భావాలను, చరిత్రను వక్రీకరించడం, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించే ప్రయత్నం చేయడం, నేను రాసిందే శాసనం అనే ధోరణిలో ఉండటం సాహిత్య విమర్శకు పనికిరావు. అలా ఉన్నప్పుడు సాహిత్య వేత్తలు సాహిత్య విమర్శను ఆహ్వానించలేరు. సహేతుకమైన విమర్శ, ఉన్నది ఉన్నట్టు రాస్తూ రచయిత తప్పులను సున్నిత పదాలతో మందలించగలిగితే తప్పకుండా అటు రచయితకు, ఇటు సాహిత్యానికి ఉపయోగపడుతుంది. అలాంటి విమర్శకులే రాచపాళెం. తప్పును తప్పని చెప్పడమే కాదు అది ఎందుకు తప్పో? ఎలా తప్పో చెప్పడానికి ఒక ఉదాహరణ కాకుండా అనేక ఉదాహరణలు చెప్తారు. పరుషమైన వాక్యాలతో రచయితను భయపెట్టకుండా సున్నితమైన పదాలతో తప్పును వివరించడం వారి విమర్శకున్న స్థాయి. డా. ఎం వినోదిని దళిత అధ్యాపకురాలిగా దుష్యంతోపాఖ్యానాన్ని తరగతి గదిలో ఎలా బోధించా లనే విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రికలో 2009లో జనవరి 12న వ్యాసం రాశారు. 1. దుష్యంతోపాఖ్యానంలో ఐదు మందిని శూద్రులుగా పేర్కొన్నారు వాళ్లలో శూద్రులు, దళితులు తండ్రులు కావడానికి వీలు లేదు. 2. ఎనిమిది రకాల వివాహాలను పేర్కొన్న దానిలో దళిత ప్రస్తావన లేదు. 3. కులాంతర వివాహం హక్కుగా ఉన్న నేడు దానిని వ్యతిరేకించే ఆ పుస్తకాన్నే బోధించడం ఎలా? ఇలా అనేక విషయాలు వినోదిని రాసిన వ్యాసంలో ఉన్నాయి. సంప్ర దాయవాదులు ఆమెను వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని రాచపాళెం తీవ్రంగా ఖండిరచడమే కాకుండా ప్రతి ఒక్కరికీ సూటిగా ఉదాహరణలతో సహా సమాధానం చెప్పారు. నాడు కొన్ని కులాలను తక్కువ చేయడం అన్ని చోట్ల ఉన్నదే అదే సాహిత్యంలో కూడా ఉన్నది. అదే నేడు కొనసాగాలంటే ఎలా? సమాజం మారినప్పుడు నాటి సాహిత్యంలో తప్పులు ఉంటే అదే చదవాలి, అందులో చెప్పింది అంతా సరైందేనని వాదిస్తే ప్రయోజనం లేదు కదా! సమాజాన్ని తిరోగమనం వైపు నడిపించిన వారే అవుతారు. ఈ సమస్యకు రాచపాళెం పరిష్కారాలు కూడా సూచించారు. ఏ పుస్తకాన్ని అయినా చదవాలి తప్పు లేదు కానీ పుస్తకాలను చదివేటప్పుడు అది మన కుల పుస్తకం, మన మత గ్రంధం అనే దృష్టితో కాకుండా ఒక రచయిత రాసిన పుస్తకమేనని చదవాలి అందులో తప్పులు ఉంటే తప్పకుండా చర్చకు పెట్టాల్సిందే.
ఉత్తమ కథ ఎలా ఉండాలనే అనుమానాలు చాలా మందికి ఉన్నాయి. కథ క్లుప్తత, ఏకాంశ వ్యగ్రత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవం ఉత్తమ లక్షణాలు అని చెప్పారు రాచపాళెం. సాహిత్య పరిణామంలో వస్తువు మారినంత వేగంగా రూపం మారదు. కవిత్వ రూపంలో ఛందస్సు, భాష ప్రధానాంకాలు. అయితే భాషలో తప్పకుండా పాత పవనాలు ఉన్నాయని చెప్పారు. అంటే వస్తువులో మార్చు రావడం కాదు భాషలో కూడా మార్పు రావాలని కాకపోతే వస్తువు మారినంత త్వరగా భాష మారడం కష్టమని అభిప్రాయపడ్డారు. ఎందుకంటే కొత్త వస్తువుపై కవిత్వం రాసినా తన సాంప్రదాయ ధోరణి వదలకపోతే ప్రయో జనం ఉండదు. వస్తువుతో పాటు భావజాలం, భాష ఆధునికంగా ఉంటేనే కవిత్వం, సాహిత్యం సమాజాన్ని ముందుకు నడిపిస్తాయి. నేటి కవిత్వాన్ని చాలామంది విమర్శకులు పోయెట్రీ ఇన్‌ న్యూస్‌ లేదా సమాచార కవిత్వం అంటున్నారు. తెలిసిన సమాచారాన్ని రాసేస్తున్నారు. అందులో పరిష్కారం ఉండదు, సృజనాత్మకత ఉండదు. కవిత చదవగానే ఒక సమాచారాన్ని చదువు తున్నట్టు అనిపిస్తోంది. సృజనాత్మకత లేని కవిత్వం తెలుగు కవిత్వ చరిత్రలో నిలబడదు.
తెలుగు సాహిత్యంలో కవిత్వంపై వచ్చినంత విమర్శ నవలపై రావడం లేదు. అదే సమయంలో వస్తున్న నవలల సంఖ్య కూడా తక్కువగా ఉన్నది. నేడు కథకు ఎక్కువగా ఆదరణ ఉన్నది. అందుకే కవిత్వం, కథలపై ఎక్కువగా విమర్శ వస్తున్నది. ప్రపంచ సాహిత్యంపై మరీ తక్కువగా విమర్శ వస్తున్నది. ఆ లోటును విమర్శకులు భర్తీ చేయాలి. 2009 సంవత్సరంలో అత్యధిక విమర్శ చేసిన రామతీర్థని ఈ సంవత్సరం మనం కోల్పోవడం బాధాకరమైన విషయం. ఇలాంటి అరుదైన పుస్తకాన్నీ తెలుగు సాహిత్య లోకానికి అందించిన రాచపాళెంకి ధన్యవాదములు.
(అక్టోబరు 16 రాచపాళెం జన్మదినం సందర్భంగా)
వ్యాస రచయిత సెల్‌ 7259511956

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img