Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పదోతరగతిలో ఉత్తమఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్

విశాలాంధ్ర,పార్వతీపురం: పదవ తరగతిలో జిల్లా స్థాయిలో గరిష్ఠ మార్కులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందనలు తెలిపారు. విజేతల మధ్య కేకును కోసి అందరికీ పంచిపెట్టారు. 96.37 శాతంతో జిల్లా రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 210 పాఠశాలల్లో 96 పాఠశాలలు శతశాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు.టి ఆర్ ఎం మునిసిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థి కంచారి బన్నదుగారి గౌతమి 591 మార్కులతో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలవగా,ఎం సింగుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి సవిరిగాన మనోజ్ కుమార్ 588 మార్కులతో 4వ స్థానం, నీలానగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి దుప్పాడ సంజన 587 మార్కులతో ఏడవ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. ఎన్నికల నామినేషన్ల సమయంలో పదో తరగతి ఫలితాలు గొప్ప సంతృప్తినిచ్చాయని చెప్పారు. తాను ప్రవేశపెట్టిన మై స్కూల్ మై ప్రైడ్ కూడా దోహద పడిందన్నారు.స్టేట్ లో ప్రధమ స్థానాన్ని సాధించడం పట్ల జిల్లా కలెక్టరును ఉత్తమ ఫలితాలు సాధించిన వారు,జిల్లాఅధికారులు సత్కరించి అభినందించారు.ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సతీమణి కరుణ,
జాయింట్ కలెక్టర్ ఎస్ ఎస్ శోబిక, జిల్లా రెవిన్యూ అధికారి జి కేశవనాయుడు, ఎస్డిసి ఆర్ వి సూర్యనారాయణ, జిల్లా విద్యాశాఖాధికారి జి పగడాలమ్మ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి. జగన్నాథ రావు, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.బి. వాగ్దేవి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్రరావు, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా పశుసంవర్ధక అధికారి ఎస్ మన్మథ రావు, జిల్లాగ్రామపంచాయతీఅధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా మత్స్య శాఖ అధికారి వి. తిరుపతయ్య, జిల్లా ప్రణాళిక అధికారి పి. వీరరాజు, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిత అధికారి ఎం.డి.గయాజుద్దీన్, జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి యు సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img