Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

అంత్యక్రియలకు ఆర్మీ విజయ్ ఆర్థిక సాయం

విశాలాంధ్ర – బాపట్ల : ఆపద ఏదైనా అండగా ఉండి ఆర్థిక సాయం అందించడమే లక్ష్యంగా యువ పారిశ్రామికవేత్త ఆర్మీ విజయ్ అడుగులు వేస్తున్నారు. కర్లపాలెం మండలంలోని పేరలి గ్రామానికి చెందిన కాగిత సుబ్బారావు ( చిన్నోడు) సరైన గృహం లేక పూరి గుడిసెలోనే నివాసం ఉండటం వల్ల గత కొన్ని రోజులుగా వీస్తున్న వాడగాలులకు తట్టుకోలేక సోమవారం మృతి చెందారు. విషయాన్ని ఆర్మీ విజయ్ తన టీం ద్వారా తెలుసుకొని సుబ్బారావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియలకు తన వంతుగా రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. ఆయన వెంట కాగిత వీరన్న, మల్లెల కరుణాకర్, కుమార్, కాగిత మణి, దేవరంపాటి రాజా, కాగిత లాభాను గ్రామస్తులు, సంఘ పెద్దలు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img