Friday, April 26, 2024
Friday, April 26, 2024

సైబర్‌ నేరాల అడ్డుకట్టకు అవగాహనే అసలైన అస్త్రం

ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్

విశాలాంధ్ర – ఒంగోలు : సైబర్ నేరాలను సమర్థవంతంగా ఎదుర్కోని, వాటిని త్వరితగతిన చేధించి భాదితులకు న్యాయం అందించటమే లక్ష్యంగా జిల్లాలోని ఎస్సై లు, సిఐలు, డిఎస్పీలు మరియు టెక్నాలజీ అసిస్టెంట్లతో ఈ రోజు ఎస్పీ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహనా కల్పించారు.

ఈ అవగాహన కార్యక్రమంలో ఇటీవల సైబర్ నేరాలపై ట్రైనింగ్ పొందిన మార్కాపురం సిఐ యం భీమా నాయక్ మరియు ఐటి కోర్ ఎస్సై కె. అజయ్ కుమార్ గార్లు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై పిర్యాదులు వచ్చినప్పుడు పోలీస్ అధికారులు వెంటనే స్పందించి ట్రాన్సాక్షన్ వివరాలు, నగదు విలువ, ఐడి వివరాలు మరియు ఇతర విషయాలు 1930 కు కాల్ చేయించి రిజిస్ట్రార్ చేసినచో, వారు వెంటనే స్పందించి బ్యాంకు అధికారుల దృష్టికి నేరం యొక్క వివరాలు తీసుకువెళ్లి, అమాయక ప్రజల నుండి కాజేసిన డబ్బులు సైబర్ నేరగాళ్ల చేతికి పోకుండా అకౌంట్ ఫ్రీజ్ చేయించడం జరుగును. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత కోర్టు ద్వారా బాధితులకు ఫ్రీజ్ చేసిన నగదును అందించే విధానము మరియు తదితర అంశాలపై అధికారులకు PPT ప్రెజెంటేషన్ ద్వారా పూర్తి అవగాహన కల్గించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరచాలని, దీని వల్ల నేరాలను నివారించే అవకాశం ఉంటుందన్నారు. సైబర్ నేరాల ఫిర్యాదుకు టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి ప్రజలకు తెలిసేలా ప్రతి పోలీస్ స్టేషన్ ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు గుర్తుండేలా క్షేత్ర స్థాయిలో మహిళా పోలీసుల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు.

ప్రస్తుత పరిస్థితుల్లో సైబర్ నేరాల ఛేదింపు కీలకంగా పరిణమించిందని, సాంకేతికత పెరిగే కొద్దీ సైబర్ నేరాలు మరింత పెరుగుతాయని కావున ప్రతి దర్యాప్తు అధికారి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ నిపుణులైన పోలీసులగా మారాలని, ప్రతి ఇన్వెస్టిగేషన్ అధికారి సమర్థవంతంగా పనిచేసి సైబర్ నేరస్థుల ఆటలు కట్టించాలని ఎస్పీ గారు సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ASP (అడ్మిన్) కె. నాగేశ్వరరావు, DSB DSP బి.మరియాదాసు, మార్కాపురం సిఐ భీమా నాయక్ ఐటి కోర్ ఎస్సై కె. అజయ్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img