Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మార్టూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

. జాతీయ రహదారిపై భారీగా నిలిచిన నీరు
. గుర్తించక అదుపుతప్పి డీవైడర్ ని డీ కొట్టి బోల్తాపడిన కారు
. వైజాగ్ నుండి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం
. ఆరుగురికి తీవ్రగాయాలు ఇద్దరి పరిస్థితి విషమం
. 108 వాహనం లేక ప్రైవేట్ అంబులెన్సు లో తరలింపు

విశాలాంధ్ర – మార్టూరు : భారీగా కురిసిన వర్షం కారణంగా జాతీయరహదారిపై ఏరులా పారుతున్న నీటిని గుర్తించక దైవదర్శనానికి వెళుతున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ని డీ కొట్టి బోల్తాపడిన ప్రమాదంలో ఓ ఎన్ ఆర్ ఐ కుటుంబం తీవ్రగాయాలకు గురైన ఘటన మార్టూరు పోలీస్ స్టేషన్ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు,పోలీసుల కధనం ప్రకారం.. గల్ఫ్ కంట్రీ లోని ఖతార్ దేశంలో హార్డ్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కొప్పులూరి రాజు వినాయకచవితి పండుగ సందర్బంగా వైజాగ్ లోని తన అత్తగారింటికి గురువారం ఉదయం భార్య ఉమా,కుమార్తె శాన్విక,కుమారుడు నిఖిత్ తో కలిసి తన అత్తగారైన రత్నం ఇంటికి వచ్చారు. వీరంతా కలిసి తిరుపతి లో దైవదర్శనానికని బావమరిది హర్ష కారులో వైజాగ్ నుండి తిరుపతికి కారులో వెళుతున్నారు. వీరు ప్రయాణిస్తున్న కారు శుక్రవారం ఉదయం మార్టూరు పట్టణం దాటగానే స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయరహదారిపై అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా జాతీయరహదారిపై ప్రమాదకరంగా నిలిచి ఉన్న వర్షపు నీటిని కారు నడుపుతున్న రాజు గుర్తించకపోవడంతో వేగంగా వస్తున్న కారు వర్షపు నీటి దాటికి అదుపుతప్పి ప్రక్కనే డివైడర్ పై ఇనప గ్రిల్స్ ని అతి వేగంగా డీ కొట్టి గాల్లోకి ఎగిరి జాతీయరహదారిపై అడ్డంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రాజు అత్త రత్నం,కుమార్తె శాన్విక బావమరిది హర్ష తీవ్రంగా గాయపడ్డారు. కారు నడుపుతున్న రాజు,భార్య ఉమా ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోవడంతో స్వల్పగాయాలకు గురై ప్రమాదం నుండి బయటపడ్డారు. మాటూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి పంపించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img