Friday, April 26, 2024
Friday, April 26, 2024

యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపడతాం

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు

విశాలాంధ్ర -మద్దిపాడు:గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కు అవసరమైన మరమ్మత్తు పనులను ఈ సీజన్లోనే పూర్తిచేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.గుండ్లకమ్మ జలాశయం గేట్ల గడ్డర్లు కొట్టకపోయినా పరిస్థితి విదితమే.ఈ సందర్బంగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు శనివారంనాడు గుండ్లకమ్మ జలాశయాన్ని సందర్శించి అధికారులు చేపడుతున్న మరమ్మత్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆవాస్ హోటల్నందు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ మూడో నంబర్ గేటు కింద భాగం దెబ్బతిని ప్రవాహవేగానికి కొట్టుకుపోవటంతో ప్రాజెక్టులో నీళ్లు కిందకు పోతున్నాయని ఆయన తెలిపారు.స్టాప్ లాక్
ద్వారా పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు ప్రయత్నించినా కూడా ప్రవాహ వేగం ఎక్కువగా ఉన్నందువల్ల అదుపు చేయలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.జలాశయంలోని నీటి నిల్వ1.25 టీఎంసీలకు తగ్గించి మరమ్మత్తులు చేపడతారు అని మంత్రి తెలిపారు.మూడవ నెంబర్ గెట్టుతో పాటు మొత్తం పది గేట్లకు మరమ్మతులు అవసరమని అధికారులు గుర్తించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆ పనుల నిర్వహణ అవసరమైన కాంట్రాక్ట్ కూడా ఖరారు చేసినట్లు ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గించి ఈ సీజన్లోనే అవసరమైన మరమ్మతులు పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.నీటి సరఫరా విషయంలో ఆయకట్టు పరిధిలోని రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి భరోసా ఇచ్చారు.ప్రస్తుతం నీరు కిందకు పోవటం వల్ల రైతులకు నష్టం జరుగుతుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు.ఏడాది మొత్తం మీద ఐదు సార్లు గుండ్లకమ్మ జలాశయం నిండుతుందని అవసరాలను బట్టి ఖరీఫ్, రబీ సీజన్లో నీరు సరఫరా చేస్తున్నామని తెలిపారు.ఈసారి కూడా అలాగే పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. అక్టోబర్ నవంబర్లో కురిసే వర్షాలతో ప్రాజెక్టు నిండుతుందన్నారు అవసరమైతే నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచి కూడా నీటిని గుండ్లకమ్మ ప్రాజెక్టులకు మళ్లించి సాగుకు సరఫరా చేస్తామని రైతుల ప్రయోజనాలను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం అధికంగా ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి స్పష్టం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి తెలుగుతల్లి విగ్రహం,గెస్ట్ హౌసులు ఏర్పాటు, పార్కులు ఏర్పాటు ,లకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చిందని గుండ్లకమ్మ జలాశయ గేట్ల మరమ్మతుల నిర్వహణ తదితర అంశాలను పట్టించుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి గత తెలుగుదేశం ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.పత్రికా విలేఖరుల సమావేశంలో గత ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి గా వ్యవహరించిన తమ వైసిపి ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు అయినా కూడా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించగా ఎదురుదాడిగా ఎల్లో మీడియా అంటూ ఆయా పత్రికలపై టీవీ చానెళ్లపై ధ్వజమెత్తారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ,జాయింట్ కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, సంతనూతలపాడు శాసనసభ్యులు టీజేఆర్ సుధాకర్ బాబు, ఇరిగేషన్ చిీప్ నారాయణరెడ్డి, యస్. ఈ. యాస్టక , ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావు ,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సరళా వందనం , గ్లొరియా,తహసీల్దార్ లక్ష్మీనారాయణ,ఆర్ ఐ వెంకటేశ్వరరావు ప్రాజెక్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img