Friday, April 26, 2024
Friday, April 26, 2024

రొండా నారపరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

ప్రకాశం – ఒంగోలు: ప్రకాశం జిల్లా వ్యవస్థాపకులు ,మాజీ పార్లమెంటు సభ్యులు, మాజీమంత్రి అయిన రొండా నారపరెడ్డి విగ్రహాన్ని కలెక్టర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసుకొనుటకు అనుమతించాలని కోరుతూ ప్రకాశం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ దినేష్ కుమార్ ని కలసి వినతిపత్రం అందించిన దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర ,వీరివెంట వైశ్య నాయకులు ఊటుకురి శ్రీమన్నారాయణ,ఒరుగంటి రెడ్డి సమాఖ్య అధ్యక్షులు ఎమ్ వెంకటరెడ్డి, బి జయరామరెడ్డి, ఆర్ రామక్రిష్ణ,బి సురేష్ ఉన్నారు. సురేంద్ర మాట్లాడుతూ రొండా నారపరెడ్డి గారు పార్లమెంటు సభ్యులు గా చేసిన కాలంలో నాగార్జున సాగర్ డ్యాం కొరకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి సాగర్ డ్యాం ఏర్పాటుకు కృషి చేశారు. మధ్య తరహా నీటిపారుదల మంత్రి గా కృష్ణ డెల్టా డ్రైనేజీ ప్రాజెక్టులతో పాటు అనేక సాగునీటి కాలువల ఏర్పాటు చేసి ఈ ప్రాంత రైతులకు అండగా నిలిచారు అంతేగాక పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాల్సిన అవసరం గుర్తించి ప్రణాళిక సిద్ధం చేసి వాణిజ్య పంటలతో రైతాంగానికి ఆర్ధిక పరిపుష్టి కలుగుతుందని ప్రోత్సహించారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేపట్టిన నిరాహారదీక్షకు మద్దతుగా నిలిచి ఆనాటి ప్రధాని నెహ్రూ గారితో బోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆచార్య ఎన్ జి రంగా, నాటి ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు గారితో కలసి చర్చలు జరిపి ప్రత్యేక తెలుగు భాషా రాష్ట్రం ఏర్పాటు చేసిన ప్రముఖులు లో నారపరెడ్డి గారు ఒకరు. గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాల నుండి కొంత భూభాగం విడదీసి ప్రకాశం జిల్లా ఆవిర్భావానికి కృషి చేసి 1972 లో నూతన ప్రకాశం జిల్లా ఏర్పాటుచేసిన రొండా నారపరెడ్డి కాంస్య విగ్రహాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకొనుట అనుమతి ఇవ్వాలని కోరుతూ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. కలెక్టర్ దినేష్ గారు సానుకూలంగా స్పందించి దానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img