Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మొక్కుబడిగా మండల సమావేశం

విశాలాంధ్ర – బల్లికురవ: ప్రజా సమస్యలకు పరిష్కార వేదికగా మారాల్సిన మండల సర్వసభ్య సమావేశం కేవలం అధికారులు తాము ముందుగా సిద్ధం చేసుకున్న నివేదికలు చదవటానికే పరిమితమయ్యాయి.గురువారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీ బడుగు.శ్రీలక్ష్మి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల అధికారులు తమ వెంట తెచ్చుకున్న పత్రంలోని నివేదికను చదివి వినిపించి వెళ్లిపోయారు.ఇలా ఒకరి వెంట ఒకరు చదువుకుంటూ తమ బాధ్యత ముగిసింది అంటూ వెళ్లిపోయారు.మండలంలోని సర్పంచులు కానీ,ఎంపీటీసీలు గాని,ఆయా గ్రామాల పరిధిలోని సమస్యల పట్ల నోరు తెరిచి మాట్లాడిన పాపాన పోలేదు.ఫలితంగా మండల సమావేశం మొక్కుబడిగా ముగిసింది.తాసిల్దార్ సీతారత్నం మాట్లాడుతూ మండలంలో రీ సర్వే జరుగుతున్నందున ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని,రెవెన్యూ సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు.ఎంపీడీవో వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ జగనన్న కాలనీలోని నివేశ స్థలాలు పొందిన ప్రతి ఒక్కరు తక్షణమే ఇంటి నిర్మాణం చేపట్టాలని అలా చేపట్టని ఎడల వారి ఇంటి పట్టాను రద్దు చేయడం జరుగుతుందనీ,ఆయా గ్రామాల్లోని అధికారులు, ఎంపీటీసీలు,సర్పంచులు లబ్ధిదారులతో మాట్లాడవాలని ఆయన సూచించారు.ఈ సందర్భంగా స్థానిక ఎస్సీ కాలనీవాసులు తమ కాలనీ లోని మురుగునీరు ఎటు వెళ్లడం లేదనీ మురుగునీరు నిలవ ఉండి రోగాలను బారిన బాధపడుతున్నామని,వర్షం కురిస్తే పైనుంచి వచ్చే వర్షపు నీరు తమ ఇళ్లల్లోకి చేరుతుందని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా తమ సమస్యను పరిష్కరించట్లేదని వాపోయారు.తక్షణమే సమస్యను పరిష్కరించాలని కానివాసులు ఎంపీడీవో కు వినతిపత్రం అందించారు.ఈ సమావేశంలో సంతమాగులూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చింతల పేరయ్య, వైస్ ఎంపీపీ ఇప్పల.వెంకటసుబ్బారెడ్డి,జెడ్పిటిసి చింతల.అంజలి,వివిధ శాఖల అధికారులు,ఆయా గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img